Begin typing your search above and press return to search.

సందీప్ వంగా.. జూనియర్ ఎన్టీఆర్.. ఏంటి మ్యాటర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ముంబై వెళ్లారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 10:00 AM GMT
సందీప్ వంగా.. జూనియర్ ఎన్టీఆర్.. ఏంటి మ్యాటర్?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రైలర్ రిలీజ్ కి ముందు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జూనియర్ ఎన్టీఆర్ మీట్ అయ్యారు. ఎన్టీఆర్ స్టే చేస్తున్న హోటల్ కి సందీప్ రెడ్డి వంగా వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారంట

అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం బయటకి రాలేదు. దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగా కూడా హాజరయ్యే అవకాశం ఉందనే టాక్ అయితే బిటౌన్ లో వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయారు. చాలా కాలంగా ముంబైలోనే ఉంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

గత ఏడాది రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా సెన్సేషన్ హిట్ అయ్యింది. దీని తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆఖరులో మూవీ స్టార్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. స్పిరిట్ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ముంబైలోనే జరుగుతోంది.

దేవర ట్రైలర్ లాంచ్ కి తారక్ అటెండ్ అవ్వడంతో సందీప్ రెడ్డి వంగా వెళ్లి కలిసారని తెలుస్తోంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తే చూడాలని ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ దేవర తర్వాత హిందీలో వార్ 2 మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మరల దేవర పార్ట్ 2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో వైపు సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్, ఐకాన్ స్టార్ట్ మూవీ లైన్ అప్ లో పెట్టుకొని ఉన్నారు.