అలాంటోడు హీరో లేకుండా వస్తున్నాడంటే..
ముఖ్యంగా యానిమల్ విడుదల తర్వాత, కథనంలో మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కొందరు అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 4 March 2025 8:00 PM ISTసందీప్ రెడ్డి వంగా సినిమాలంటే ఓ ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ దర్శకుడు, తర్వాత బాలీవుడ్‌లో కబీర్ సింగ్, యానిమల్ తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ఆయన చిత్రాలకు ఎక్కువగా హీరో సెంట్రిక్‌గా ఉంటాయని విమర్శలు రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా యానిమల్ విడుదల తర్వాత, కథనంలో మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కొందరు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి విమర్శల నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ సినిమాల్లో పాటలు లేదంటే, హీరోలు లేకుండా సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన సంచలన సమాధానం ఇచ్చారు. ‘‘హీరో లేకుండా సినిమా తీయాలనిదే నా లాంగ్‌టైమ్ ప్లాన్. కానీ అలాంటి సినిమా తీయగానే ఇప్పుడెలాగో మళ్లీ అదే విమర్శలు వస్తాయి. ఓ నాలుగైదు ఏళ్లలో నేను హీరో లేకుండా సినిమా తీయబోతున్నా. అప్పటికి ఆ విమర్శలు చేసే వాళ్లే ‘సందీప్ అప్పుడే చెప్పాడు, ఇప్పుడు చేసి చూపించాడు’ అంటారు’’ అని ఆయన అన్నారు.
సందీప్ కామెంట్స్ కేవలం సరదాగా చేసినవేనా లేక నిజంగానే ఆయన అలాంటి కాన్సెప్ట్‌ను ప్లాన్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి టాలీవుడ్, బాలీవుడ్‌లో హీరో డామినేట్ చేసే కథలు, కథనాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే సందీప్ వంగా హీరో లేకుండా సినిమా తీయగలిగితే ఆయనే హీరోగా హైలెట్ అవుతాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే వంగా డైరెక్షన్ తోనే కాదు, తన అటిట్యూడ్ తో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
అతను మాట్లాడితే ఇంటర్వ్యూలు చూసే వారి సంఖ్య ఎక్కువే. ఇక హీరో లేకుండా సినిమా అంటే సందీప్ వంగా బ్రాండ్ వాల్యూతోనే ఆ సినిమాకు మంచి హైప్ క్రియేట్ కావడం పక్కా. సినిమాలకు రన్ టైమ్ ఫార్ములా అవసరం లేదని నిరూపించిన సందీప్ చాలా వరకు మేకింగ్ లో కమర్షియల్ బౌండరీలను బ్రేక్ చేశాడు. ఇక అలాంటోడు హీరో లేకుండా వస్తున్నాడు.. అంటే అందులో మరికొన్ని కమర్షియల్ బౌండరీలు బ్లాస్ట్ అవ్వడం పక్కా.
ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రాబోతోంది. ముఖ్యంగా ప్రభాస్ గత సినిమాల్లా కాకుండా, ఇందులో సందీప్ మార్క్ మాస్, ఎమోషన్, డార్క్ ఇంటెన్సిటీ కాబోతోందని టాక్. ఇక స్పిరిట్ తర్వాత యానిమల్ 2, అల్లు అర్జున్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.