యానిమల్‌ని విమర్శించి హీరోని పొగిడారు.. నా సంగతేంటి?
అయితే యానిమల్ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో రక్తపాతం హింసను విమర్శించారు. చాలామంది దర్శకుడిని టార్గెట్ చేసారు. ముఖ్యంగా రణబీర్ కి ఇంత పెద్ద హిట్టిచ్చిన సందీప్ ని బాలీవుడ్ లోని కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేయడం చర్చకు వచ్చింది.
By: Tupaki Desk | 26 Feb 2025 4:28 AM GMTరణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని తెలుగు దర్శకుడు సందీప్ వంగా అందించారు. అయితే యానిమల్ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో రక్తపాతం హింసను విమర్శించారు. చాలామంది దర్శకుడిని టార్గెట్ చేసారు. ముఖ్యంగా రణబీర్ కి ఇంత పెద్ద హిట్టిచ్చిన సందీప్ ని బాలీవుడ్ లోని కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేయడం చర్చకు వచ్చింది.
ఇప్పుడు దర్శకుడు సందీప్ వంగా టోకున అందరికీ తనదైన స్టైల్లో ఇచ్చారు. చిత్ర పరిశ్రమ యానిమల్‌ను విమర్శించి, రణ్‌బీర్ కపూర్‌ను ఎలా ప్రశంసించిందో గుర్తుచేసుకుంటూ బాలీవుడ్‌లో ఉన్న అసమానతను సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించారు. యానిమల్ సినిమాను విమర్శించారు.. కానీ రణబీర్ ని పొగిడారు. నాకు రణబీర్ పై అసూయ లేదు, కానీ నాకు ఆ అసమానత అర్థం కాలేదు. వారు (పరిశ్రమలోని వ్యక్తులు) రణబీర్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. పరిశ్రమకు నేను కొత్త. నాపై కామెంట్లు చేయడం సులభం. విమర్శించడం సులువు. ఒక ఫిలింమేకర్ ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాడు.. కానీ ఒక నటుడు సంవత్సరానికి ఐదుసార్లు సినిమాల్లో కనిపిస్తాడు. స్టార్లు ఎవరితో కలిసి పని చేస్తారో ఎక్కువగా చెప్పరు.. అని అన్నారు.
బాలీవుడ్‌లో తనను బయటి వ్యక్తిగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, సందీప్ వంగా అలాంటిదేమీ లేదని అన్నారు. నేను లోపలి వ్యక్తి.. బయటి వ్యక్తి అనేవి నమ్మను. నేను ఎప్పుడూ బయటి వ్యక్తిగా భావించలేదు. నేను ఇప్పటికే చెప్పినట్లుగా ముఠా తత్వం, అసమానత ఉన్నాయి. అయితే ఇలాంటి పాఠశాలకు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కిండర్ గార్టెన్ నుండి అక్కడ చదువుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి 10వ తరగతిలో చేరినప్పుడు మీరు సీనియారిటీ ఫీలవుతారు కదా! ఇదీ అలాంటిదేనని అన్నారు.
కబీర్ సింగ్‌లో తనతో కలిసి పనిచేసిన ఒక నటుడికి ఒక ప్రధాన బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎలా అవకాశం ఇవ్వలేదో కూడా సందీప్ వంగా చెప్పాడు. ఈ పక్షపాతానికి పరిశ్రమను విమర్శించాడు. రణబీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ , రష్మిక మందన్న విషయంలోను అలాగే చేయమని ఆ నిర్మాణ సంస్థకు సవాల్ విసిరాడు. సందీప్ వంగా తన నిరాశను వ్యక్తం చేస్తూ, పరిస్థితి చూసి తాను చిరాకు పడ్డానని, బాధపడ్డానని చెప్పాడు.
యానిమల్ ఒక యాక్షన్-డ్రామా. హింస, స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది. జావేద్ అక్తర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని బహిరంగంగా విమర్శించారు. అయితే ఎవరు ఎలా విమర్శించినా కానీ, యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ఒక శక్తివంతమైన పారిశ్రామికవేత్త కుమారుడు రణ్‌విజయ్ సింగ్ కథను.. అతడి తండ్రితో సమస్యాత్మక సంబంధాన్ని తెరపై సందీప్ వంగా అద్భుతంగా ఆవిష్కరించారు. కథానాయకుడి తండ్రిపై హత్యాయత్నం తర్వాత ప్రతీకారం కోసం కథానాయకుడు ఎలాంటి విధ్వంశం సృష్టించాడో ఇందులో చూపించారు.