Begin typing your search above and press return to search.

వర్మ సినిమాలు చూసి నేర్చుకున్నా..!

టాలీవుడ్‌ లో అర్జున్‌ రెడ్డి సినిమాను తీసి దర్శకుడిగా కెరీర్‌ ను మొదలు పెట్టిన సందీప్‌ వంగ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 7:35 AM GMT
వర్మ సినిమాలు చూసి నేర్చుకున్నా..!
X

టాలీవుడ్‌ లో అర్జున్‌ రెడ్డి సినిమాను తీసి దర్శకుడిగా కెరీర్‌ ను మొదలు పెట్టిన సందీప్‌ వంగ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. ఈయన రణబీర్‌ కపూర్‌ తో చేసిన యానిమల్ సినిమా దాదాపుగా రూ.వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఆయన దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు దాదాపు అందరు బాలీవుడ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన ప్రభాస్ తో స్పిరిట్‌ సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివరి వరకు స్క్రిప్ట్‌ వర్క్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి.

సందీప్ వంగ తాజాగా జరిగిన ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఉత్తమ ఎడిటర్ అవార్డును సొంతం చేసుకున్నారు. దర్శకుడిగానే కాకుండా ఉత్తమ ఎడిటర్ అవార్డును సొంతం చేసుకోవడం చాలా ప్రత్యేకమైన విషయం. అవార్డు తీసుకున్న సందర్భంగా సందీప్ వంగ మాట్లాడుతూ.. తాను రామ్‌ గోపాల్‌ వర్మ గారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ నేను ఎడిటింగ్ ఎలా చేయాలి అనే విషయాలను నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను అన్నట్లుగా సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వేడుకలో వర్మ పేరు ఎత్తి సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సందీప్ వంగ మాట్లాడిన వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ఇకపై నీ వద్ద నేను ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటూ కామెంట్ పెట్టాడు. వర్మ వంటి సీనియర్ గొప్ప దర్శకుడి నుంచి అలాంటి కామెంట్‌ రావడం గొప్ప విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఈ విషయం తెగ వైరల్‌ అవుతోంది.

సందీప్‌ వంగ అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్‌ సింగ్‌ అంటూ రీమేక్ చేసి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా సాధించిన వసూళ్లు, పొందిన గుర్తింపు కారణంగా అంచనాలు భారీగా నమోదు అయ్యాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా యానిమల్‌ సినిమాను రూపొందించారు. యానిమల్ సినిమా సాధించిన విజయం తో స్పిరిట్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి ప్రభాస్ తో దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ ను ఎలా రూపొందిస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న స్పిరిట్ ను 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.