Begin typing your search above and press return to search.

SSMB29: రాజమౌళి టీమ్ లో సందీప్ వంగా..

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రాజమౌళి టీమ్ లో సందీప్ రెడ్డి వంగా భాగం అయ్యే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2024 5:36 AM GMT
SSMB29: రాజమౌళి టీమ్ లో సందీప్ వంగా..
X

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 2025లో మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. 1000 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో జక్కన్న ఉన్నారు.

కచ్చితంగా ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు, రాజమౌళి పేరు మార్మోగిపోవడం గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో భాగం కావడం దాదాపు ఖాయం అనే మాట వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం తన లుక్ కంప్లీట్ గా మార్చేశారు. ప్రస్తుతం మహేష్ మూవీ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రాజమౌళి టీమ్ లో సందీప్ రెడ్డి వంగా భాగం అయ్యే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు. దీనికి కారణం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా రాజమౌళికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ సమయంలో కనీసం 20-25 రోజులు మీ షూటింగ్ ని అబ్జర్వ్ చేసి నేర్చుకునే అవకాశం నాకివ్వండి అని సందీప్ రెడ్డి అడిగారు.

నేను ఆ సమయంలో ఎలాంటి వర్క్ లో ఉన్నా కూడా కచ్చితంగా టైం చేసుకొని మీతో జాయిన్ అవుతాను అని చెప్పారు. దీనికి రాజమౌళి కూడా ఒకే చెప్పారు. కచ్చితంగా పిలుస్తానని అన్నారు. ఈ వీడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ సందీప్ రెడ్డి రిక్వెస్ట్ ని గుర్తుపెట్టుకొని SSMB29 మూవీ షూటింగ్ సమయంలో పిలిస్తే మాత్రం కచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చని అనుకుంటున్నారు.

ఒకవేళ వీరిద్దరూ ‘SSMB29’ వెంచర్ లో భాగం అయితే ఆ న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి సందీప్ రెడ్డి వంగాతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ‘SSMB29’ మూవీ షూటింగ్ సమయంలో సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో ఉంటాడు. మరి ఆ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ‘SSMB29’ సెట్ కి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.