Begin typing your search above and press return to search.

ఇలా డైరెక్ట‌ర్ కోసం పిచ్చెక్కిపోవ‌డం ఇదే తొలిసారి!

ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే కుద‌ర‌దు అని గ‌ట్టిగా అడిగే అంత సీన్ ఇంత‌వ‌ర‌కూ ఏ డైరెక్ట‌ర్ విష‌యంలోనూ చోటు చేసుకోలేదు.

By:  Tupaki Desk   |   7 March 2025 6:00 AM IST
ఇలా డైరెక్ట‌ర్ కోసం పిచ్చెక్కిపోవ‌డం ఇదే తొలిసారి!
X

సినిమాల్లోకి వ‌చ్చిన ప్ర‌తీ న‌టుడుకి స్టార్ డైరెక్ట‌ర్ తో ప‌నిచేయాల‌ని ఉంటుంది. అలాంటి అవ‌కాశం ఎప్పుడొస్తుందా? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు మిస్ చేసుకోకుండా న‌టిస్తారు. అంత‌కు మించి డైరెక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఛాన్స్ ఇవ్వండి నేను న‌టిస్తాను. ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే కుద‌ర‌దు అని గ‌ట్టిగా అడిగే అంత సీన్ ఇంత‌వ‌ర‌కూ ఏ డైరెక్ట‌ర్ విష‌యంలోనూ చోటు చేసుకోలేదు.


ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో ఫాంలో ఉన్న డైరెక్ట‌ర్లు ఎవ‌రు? అంటే రాజ‌మౌళి, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, సందీప్ రెడ్డి వంగా, చందు మొండేటి ఇలా కొంత మంది ఉన్నారు. కానీ వీళ్లంద‌రిలో అంద‌రి మోస్ట్ ప్యావరెట్ ఎవ‌రు? అంటే సందీప్ రెడ్డి వంగా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్పిరిట్ సినిమాలో అవ‌కాశం కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో? తెలిసిందే.

మంచు విష్ణు అయితే ఏకంగా ఛాన్స్ కోసం ద‌ర‌ఖాస్తూ కూడా చేసుకున్నాడు. ఆదిత్య ఓం అయితే స్పిరిట్ లో తాను ఎలాంటి పాత్రకైతే స‌రిపోతానే ముందే చెప్పేస్తున్నాడు. ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా ఇలాంటి వాళ్లు స్పిరిట్ లో అవ‌కాశాల కోసం ఎంతో మంది బ‌య‌ట నుంచి ప్ర‌య‌త్నిస్తున్నారు. సందీప్ రెడ్డి మావైపు చూడ‌క‌పోతాడా? అత‌డి సినిమాలో ఛాన్స్ ఇప్ప‌టిక‌ప్పుడు ఛాన్స్ ఇవ్వ‌క‌పోతాడా? అని మొండి ధైర్యంతో ఎదురు చూస్తున్నారు.

ఇలా ఓ డైరెక్ట‌ర్ కోసం ఓ న‌టుడు తాప‌త్ర‌య ప‌డ‌టం అన్న‌ది బ‌హుశా ఇదే తొలిసారి కావ‌చ్చు. `బాహు బ‌లి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి గొప్ప‌సినిమాలు రాజ‌మౌళి చేసారు. ప్ర‌స్తుతం మ‌హేష్ తో ఓసినిమా చేస్తున్నారు. ఇది ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ సినిమానే. అలాగే సుకుమార్ త‌దుప‌రి చిత్రం కూడా భారీగానే ఉంటుంది. ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉంటుంది. కానీ వీళ్ల సినిమాల్లో అవ‌కాశాల కోసం ఏ న‌టుడు ఇంత‌గా తాప‌త్ర‌య ప‌డ‌టం లేదు. అది కేవ‌లం సందీప్ రెడ్డికి మాత్ర‌మే సాధ్య‌మైంది.