Begin typing your search above and press return to search.

సందీప్ వంగా దర్శకత్వంలో ధోని.. ఆ బోల్డ్ సీన్ కూడా..

అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ ఏంటంటే.. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసి ఓ యాడ్ షూట్ చేశారు.

By:  Tupaki Desk   |   18 March 2025 4:51 PM IST
సందీప్ వంగా దర్శకత్వంలో ధోని.. ఆ బోల్డ్ సీన్ కూడా..
X

సినిమా డైరెక్టర్స్, క్రికెట్ లెజెండ్స్ కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే, అది ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్‌గా మారుతుంది. అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ ఏంటంటే.. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసి ఓ యాడ్ షూట్ చేశారు. సాధారణంగా గ్రౌండ్‌లో బ్యాట్‌తో సంచలనం సృష్టించే ధోని, ఈమధ్య కాలంలో చేస్తున్న యాడ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈసారి మరింత డిఫరెంట్ గా కెమెరా ముందుకు వచ్చాడు.

ఈ సంచలన యాడ్‌లో ధోని, ‘యానిమల్’ సినిమాలోని కొన్ని పవర్‌ఫుల్ సన్నివేశాలను రీక్రియేట్ చేశాడు. అందులో ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రణ్‌బీర్ కపూర్ చేసిన సైగను మహీ కూడా అచ్చం అలాగే చేశాడు. అంతే కాదు, సినిమాలో రణ్‌బీర్ కపూర్ ఇంట్రోలో లాగే కారులో దిగే స్టైల్, సైకిల్ మీద వెళ్లే సన్నివేశాలను కూడా మళ్లీ తీశారు.ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ‘ఇ మోటరాడ్’ యాడ్ కోసం ఈ విధంగా చేశారు. అయితే, ఇదంతా యానిమల్ కాంటెంట్‌తో సాగినా, దీన్ని ఫన్నీ మోడ్‌లో తెరకెక్కించడం ఆసక్తికరంగా మారింది.

ఇక అసలు టాక్ రావాల్సింది ధోని చేసిన బోల్డ్ సీన్ గురించే. రణ్‌బీర్ కపూర్ సైగ చేసిన ఇంటెన్స్ మోమెంట్స్‌ను కూడా ధోని సునాయాసంగా ఫాలో అయ్యాడట. ఇదే ఆయనను అభిమానులకే కాకుండా, సినీ ప్రేమికులకు కూడా మరింత దగ్గర చేసిన సీన్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే ధోని యాక్టింగ్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన ఫ్యాన్స్, మహీ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనే చర్చ మొదలుపెట్టేశారు.

ఇప్పటివరకు ధోని కెరీర్‌లో ఎన్నో బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఈసారి డైరెక్టర్ వంగా టచ్ ఇవ్వడంతో ఆ యాడ్‌కు మరింత హైప్ వచ్చింది. ఇదే సమయంలో సందీప్ వంగా తన నెక్ట్స్ సినిమా స్పిరిట్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్‌తో షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.

మరోవైపు, RC16లో ధోని కనిపించనున్నాడనే వార్తలు కూడా కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యాయి. కానీ, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని ఇటీవల క్లారిటీ వచ్చింది. అయినా, మహీకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగినట్లు ఈ యాడ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. అలాగే ఆదాయం కూడా బాలీవుడ్ హీరోల రేంజ్ లోనే అందుకుంటున్నాడు.