Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో రౌడీ బాయ్, రణబీర్?

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:36 AM GMT
ప్రభాస్ తో రౌడీ బాయ్, రణబీర్?
X

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్' మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది డార్లింగ్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ సినిమా కానుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత వంగా నుంచి రాబోతున్న ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'స్పిరిట్' మూవీలో ప్రభాస్ కు తోడుగా మరికొందరు స్టార్ హీరోలను భాగం చేస్తున్నారని తెలుస్తోంది. ఓ పాపులర్ స్టార్ హీరోని విలన్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా టాక్. అలాగే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించే అవకాశం ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్, రణబీర్ లతో వర్క్ చేసిన సందీప్ వంగా.. వారితో తన నెక్స్ట్ చిత్రంలో అతిథి పాత్రలు చేయించాలని భావిస్తున్నారట.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రంలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో కర్ణుడిగా ప్రభాస్ కనిపిస్తే, రౌడీ బాయ్ అర్జునుడి పాత్రలో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. 'కల్కి' పార్ట్-2లోనూ వీడీ పాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ''స్పిరిట్" మూవీలో ప్రభాస్ తో కలిసి విజయ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడనే మాట వినిపిస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో అన్ని సినిమాల్లోనూ ఇతర భాషల నటీనటులను తీసుకుంటున్నారు. అందులోనూ 'స్పిరిట్' ను పాన్ ఇంటర్నేషనల్ గా తీసుకెళ్ళాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి, స్టార్ క్యాస్టింగ్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

"స్పిరిట్" అనేది ఒక కాప్ డ్రామా అని సందీప్ వంగా ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అంతే డార్లింగ్ తన తన కెరీర్ లోనే తొలిసారిగా ఖాకీ డ్రెస్ వేసి, లాఠీ పట్టుకోబోతున్నారు. ఆయన లుక్ కూడా కొత్తగా, చాలా స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అందులోనూ రెబల్ స్టార్ ఈసారి డ్యూయల్ రోల్ ప్లే చేస్తారనే మరో రూమర్ కూడా ఫ్యాన్స్ ను మరింత ఎగ్జైట్ చేస్తోంది.

టీ-సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చనున్నారు. భారతీయ భాషలతో పాటుగా మాండరిన్, జపనీస్, కొరియన్ వంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.