Begin typing your search above and press return to search.

స్పిరిట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవ‌రికి?

'యానిమ‌ల్` లో ర‌ష్మిక పాత్ర‌ని...తృప్తి డిమ్రి పాత్ర‌లు సైతం సినిమాలో హైలైట్ అవ్వ‌డంతో అంత‌కం త‌కు చ‌ర్చ‌కు దారి తీస్తుంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:30 PM GMT
స్పిరిట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవ‌రికి?
X

మార్కెట్ లో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చిత్రాల్లో హీరోయిన్లు ఫెవ‌రెట్ గా మారిపోతున్న సంగ‌తి తెలిసిందే. `అర్జున్ రెడ్డి` తో షాలిని పాండే..`కబీర్ సింగ్` తో కియారా అద్వాణీ..`యానిమ‌ల్` తో ర‌ష్మిక మంద‌న్నాల‌కు ప్ర‌త్యేక‌మైన ఐడెటింటీ రావ‌డ‌మే ఈ ఫాలోయింగ్ కి కార‌ణ‌మైంది. అంద‌రి డైరెక్ట‌ర్ సినిమాల్లోనూ హీరోయిన్లు ఉంటారు. కానీ సంద‌ప్ సినిమాలో హీరోయిన్ అంటే? ఓ సంచ‌ల‌నంగా మారుతుంది. ఇప్పుడు సంచ‌ల‌నం పెను సంచ‌ల‌న‌గానూ మారింది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

'యానిమ‌ల్` లో ర‌ష్మిక పాత్ర‌ని...తృప్తి డిమ్రి పాత్ర‌లు సైతం సినిమాలో హైలైట్ అవ్వ‌డంతో అంత‌కం త‌కు చ‌ర్చ‌కు దారి తీస్తుంది. దీంతో సందీప్ త‌దుప‌రి సినిమాలో హీరోయిన్ ఎవ‌రవుతారు? అన్న చ‌ర్చ ఇప్ప‌టి నుంచే మొద‌లైంది. అందులోనూ సందీప్ త‌దుప‌రి సినిమా ఏకంగా పాన్ ఇండియా సంచ‌ల‌నం ప్ర‌భాస్ తెర‌కెక్కిస్తున్నాడు కాబ‌ట్టి హీరోయిన్ ఇంకా హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో సందీప్ ఆ ఛాన్స్ ఎవ‌రికి ఇస్తారు? సౌత్ హీరోయిన్ ని దించుతాడా? నార్త్ భామ‌ని దిగుమ‌తి చేస్తాడా? అన్న డిస్క‌ష‌న్ షురూ అవుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా ఏడాది మిడ్ నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌య్యాయి. త‌దుప‌రి ప‌నుల‌కు సందీప్ సిద్దమ‌వుతున్నాడు. ఎలాంటి న‌టీన‌టుల్ని తీసుకోవాలి? టెక్నిక‌ల్ టీమ్ ఎలా ఉండాలి? ఇలా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు సిద్ద‌మవుతున్నాడు. ప్ర‌స్తుతం `యానిమ‌ల్` స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా! అంతే సీరియ‌స్ గా స్పిరిట్ సినిమా వ‌ర్క్ మొద‌లు పెట్టాడు. మ‌రోవైపు స‌లార్ సీజ్ పైర్ విజ‌యంతో ప్ర‌భాస్ రేంజ్ అంత‌కంత‌కు పెరిగిపో యింది.

ఈ నేప‌థ్యంలో స్పిరిట్ పై అంచ‌నాలు ఇంకేస్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రైన క‌టౌట్ కి..కంటెంట్ ఉన్న డైరెక్ట‌ర్ దొరికాడు కాబ‌ట్టి తిరుగుండ‌ద‌నే భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డార్లింగ్ ప‌క్క‌న హీరోయిన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకున్నా ఆ హీరోయిన్ రేంజ్ మాత్రం మారిపోవ‌డం ఖాయం.