Begin typing your search above and press return to search.

రెస్టారెంట్ రైడ్ పై మరో క్లారిటీ.. అవన్నీ రూమర్లే!

అయితే ఆ తనిఖీల్లో వివాహ భోజనంబు రెస్టారెంట్‌ లో సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారని అధికారులు నోటీసులు జారీ చేసినట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి.

By:  Tupaki Desk   |   26 July 2024 5:58 AM GMT
రెస్టారెంట్ రైడ్ పై మరో క్లారిటీ.. అవన్నీ రూమర్లే!
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. వివాహ భోజనంబు పేరుతో సందీప్ నడిపిస్తున్న రెస్టారెంట్ కు హైదరాబాద్ లో ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా వివాహ భోజనంబు సికింద్రాబాద్ బ్రాంచ్ లో కూడా తనిఖీలు చేపట్టారు అధికారులు.

అయితే ఆ తనిఖీల్లో వివాహ భోజనంబు రెస్టారెంట్‌ లో సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఆహారాన్ని సర్వ్ చేస్తున్నారని అధికారులు నోటీసులు జారీ చేసినట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో సందీప్ కిషన్ వాటిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చిన ప్రతి హెడ్‌ లైన్స్‌ ను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోమని ట్వీట్ చేశారు. ఇప్పుడు మరోసారి రాయన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్పందించారు.

తన రెస్టారెంట్ లో సాధారణ తనిఖీ మాత్రమే జరిగిందని చెప్పారు సందీప్ కిషన్. తమకు ఎక్స్‌ పైర్ అయిపోయిన బియ్యంతో మోసం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏడు బ్రాంచ్ ల నుంచి అంతకంటే ఎక్కువ డొనేట్ చేస్తున్నట్లు చెప్పారు. రోజూ ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఉచితంగా 50 మందికి భోజనాలు పంపిస్తున్నామని చెప్పారు. అంటే రోజూ సుమారు 350 మందికి ఫుడ్ ప్యాకెట్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

ఉచిత ఫుడ్ ప్యాకెట్ల రూపంలో దాదాపు నెలకు రూ.4 లక్షల కంటే ఎక్కువ విరాళాన్ని అందిస్తున్నట్లు సందీప్ తెలిపారు. కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుంటే.. రైస్ ప్యాకెట్‌ ను ఎందుకు ఆదా చేస్తామని సందీప్ కిషన్ ప్రశ్నించారు. ఎన్ని దానధర్మాలు చేసినా పరిశుభ్రత ఉండాలని, రెస్టారెంట్ లో ఎటువంటి పరిశుభ్రత సమస్యల గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తావించలేదని సందీప్ కిషన్ చెప్పారు.

అయితే రైడ్ జరిగిన తర్వాత రోజు.. నార్మల్ డే కన్నా ఎక్కువ మంది కస్టమర్లు వచ్చారని సందీప్ తెలిపారు. తప్పుడు రూమర్లు వచ్చినా.. రెస్టారెంట్ ఇమేజ్ దెబ్బతినలేదని చెప్పారు. తమ రెస్టారెంట్ అవుట్ లెట్స్ లో నాణ్యతను ప్రజలు విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు. ఒక హీరోగా ప్రజలకు తానేం చేయగలనని ఆలోచించినప్పుడు రెస్టారెంట్ ఏర్పాటు చేశానని, దాని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించానని చెప్పారు. ఇప్పుడు ఎంతో మంది కడుపు నింపుతున్నానని తెలిపారు.