Begin typing your search above and press return to search.

హ్యాట్సాఫ్ రియ‌ల్ హీరో..అనాధ‌ల‌కు నిత్యాన్న‌దానం!

అయితే అదే రెస్టారెంట్ నుంచి రోజు 350 మంది అనాధ బాల‌ల‌కు, రోడ్ ప‌క్క‌న జీవ‌నం సాగించే వారికి అన్న‌దానం చేస్తున్నాడు? అన్న‌ది ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   25 July 2024 6:08 AM GMT
హ్యాట్సాఫ్ రియ‌ల్ హీరో..అనాధ‌ల‌కు నిత్యాన్న‌దానం!
X

టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. కానీ అన్ని తెర‌పైకి రావు. కొంద‌రికి ప్ర‌చారం చేసుకోవ‌డం న‌చ్చ‌దు. తాము ఎలాంటి స‌హాయం చేసినా చెప్పుకోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌రు. సాయం చేసిన త‌ర్వాత చెప్పుకోవ‌డం ఏంటి? అన్న కోణంలో చాలా మంది చెప్పుకోరు. కానీ అప్పుడ‌ప్పుడు అవి బ‌య‌ట ప‌డాల్సిన స‌మ‌యం వ‌స్తే వాటంత‌ట అవే బ‌య‌ట ప‌డుతుంటాయి. తాజాగా యంగ్ హీరో సందీప్ కిష‌న్ కూడా అలాంటి స‌హాయం చేయ‌డంలో ముందుంటాడ‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

సందీప్ కిష‌న్ కి రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో యువ హీరో వ్యాపారానికి తిరుగులేదు. చాలా మంది సెల‌బ్రిటీల‌తో పాటు పేరున్న చాలా మంది ఆ రెస్టారెంట్ లో రుచుల్ని ఆస్వాదిస్తార‌ని పేరుంది. అయితే అదే రెస్టారెంట్ నుంచి రోజు 350 మంది అనాధ బాల‌ల‌కు, రోడ్ ప‌క్క‌న జీవ‌నం సాగించే వారికి అన్న‌దానం చేస్తున్నాడు? అన్న‌ది ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా తానే రివీల్ చేసాడు.

త‌న రెస్టారెంట్ నుంచి రోజు 350 భోజ‌నాలు పంపిణీ చేస్తుంటాడుట‌. అందుకు గాను నెల‌కు నాలుగు ల‌క్షలు ఖ‌ర్చు అవుతుంద‌ని ఒపెన్ అవ్వడానికి ఇష్టం లేక‌పోయినా ఓప్ అయ్యాడు. నిజానికి సందీప్ ఇలా నిత్యాన్న‌దానం చేస్తున్నాడు? అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న చుట్టూ ఉన్న వారికి త‌ప్ప త‌న‌లో ఇంత గొప్ప దాతృహృద‌యం అన్న‌ది ఇప్పుడే అంద‌రికీ తెలుస్తుంది.

అందుకే ఎలాంటి స‌హాయం చేసినా దాన్ని చెప్పుకోవ‌డంలో త‌ప్పులేదు. అలాంటి వాళ్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని మ‌రింత మంది స‌హాయం చేయ‌డానికి ముందుకు రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే చేసినా స‌హాయం చిన్న‌దైనా, పెద్ద‌దైనా న‌లుగుర‌కి చెప్ప‌డం ఎంతో మేలు చేస్తుంద‌ని ఛారిటీ సంస్థ‌లు చెబుతంటాయి. ఆ ర‌కంగా సందీప్ కిష‌న్ అభిమానుల్లో గుండెల్లో రియ‌ల్ హీరో అయ్యాడు.సందీప్ గురించి ఈ విషయం తెలిసి నెటిజ‌నులు హ్యాట్సాఫ్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. త‌న సినిమాలు మంచి విజ‌యం సాధించాల‌ని, ఇంకా డ‌బ్బు బాగా సంపాదించి మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోరుకుంటున్నారు.