సందీప్ రెడ్డి జగ మొండిలా ఉన్నాడే!
సెట్ లో దర్శకుడితే తుది నిర్ణయం కాబట్టి దర్శకుడి మాటకు తప్పక కట్టుబ డాల్సిందే.
By: Tupaki Desk | 20 Dec 2023 5:30 PM GMTదర్శకులంతా మొండేళ్లే. తమకు కావాల్సిన ఔట్ ఫుట్ రాబట్టుకోవడం కోసం నటీనటుల్ని ఎంతగా ఇబ్బంది పెడతారా? ఇంటర్వ్యూల సమయంలో ఆ నటులు చెబుతుంటే అర్ధమవుతుంది. ఇష్టపడో.. కష్టపడో ఎలాగో తమకు కావాల్సిన ఔట్ ఫుట్ వచ్చే వరకూ నటీనుటులతో దర్శకులు అంతే కఠినంగా వ్యవహరిస్తుంటారు. సెట్ లో దర్శకుడితే తుది నిర్ణయం కాబట్టి దర్శకుడి మాటకు తప్పక కట్టుబ డాల్సిందే. అయితే దర్శకులందరి లోకి జగ మొండి ఎవరంటే? సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పాలేమో.
అవును ఆయన మొండితనం ఎలా ఉంటుందో? అతనితో కలిసి పనిచేసిన నటీనటులు చెబుతుంటే తెలుస్తోంది. `అర్జున్ రెడ్డి` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి ఆ చిత్రాన్ని ఎంత రా అండ్ రస్టిక్ గా పాత్రల్ని చూపించాడో తెలిసిందే. అందులో హీరో సైకో యిక్ ప్రేమని ఓ రేంజ్ లో హైలైట్ చేసాడు. సినిమా సక్సెస్ కి అదే కారణం. ఓ పాత్రని తెరపై ఎంత బలంగా చూపింవచ్చో తొలి సినిమాతోనే సందీప్ రెడ్డి ప్రూవ్ చేసాడు.
ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్ లో `కబీర్ సింగ్` టైటిల్ తో రీమేక్ చేసి అంతకు మించి గొప్ప సక్సెస్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన `యానిమల్` తో సందీప్ రెడ్డి ఎంత జగమొండో? మరోసారి తేటతెల్లమైంది. అందులో హీరో రణబీర్ కపూర్ పాత్రని నిజంగా యానిమల్ గానే తీర్దిద్దిద్దాడు. తండ్రిపై సైకోయిక్ ప్రేమని ఏ రేంజ్ లో లాంచ్ చేసాడో చూసాం. తండ్రిని చంపాలనుకున్న పాత్రధారుని హీరో నరరూప రాక్షసుడిలా పీక కోసం చంపడన్నా ఎంత కఠోరంగా చూపించాడో తెలిసిందే.
ఎక్కడా బ్లర్ వేయకుండా ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులకు చూపించాడు. దీంతో అతని ఇంటెన్షన్ ఎంత బలంగా ఉందో అర్దమైంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు రణబీర్ కపూర్.. బాబిడియోల్. .రష్మిక మందన్న ..సందీప్ కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డారో పబ్లిక్ గానే చెప్పారు. రణబీర్ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎలా ఫీలయ్యాడో మీడియా ముఖంగా రివీల్ చేసాడు. ఇలా చేయడం కరెక్టేనా? అని ఆలోచించుకునే లా చేసాడు. చివరకి భార్య అలియాభట్ సహకారంతో రియలైజ్ వాటిలో నటించినట్లు తెలిపాడు.
అలాగే బాబి డియోల్ కూడా కృరమైన పాత్రలో నటించడం కోసం తానెంత ఇబ్బంది పడ్డాడో కూడా తెలిపాడు. ఇక రష్మిక మందన్నా రొమాంటిక్ సన్నివేశాల కోసం తానెంత ఇబ్బంది పడిందో? కెమెరా ముందు చెప్పలేకపోయినా! ఆఫ్ ది స్క్రీన్ స్నేహితుల వద్ద తన మనోవేదన చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. తమ ఇబ్బందిని నటులెవరు కూడా దర్శకుడు ముందు పెట్టకుండా పాత్రలకు న్యాయం చేయడం కోసమే ఇలా నటించాల్సి వచ్చింది అన్నది వాస్తవం.