Begin typing your search above and press return to search.

యానిమల్ ని మించి వైలెన్స్.. మహేష్ సినిమాపై సందీప్ కామెంట్..!

అయితే దీనికి సందీప్ వంగ క్లారిటీ ఇచ్చారు. తాను మహేష్ తో చేయాలనుకున్న సినిమా యానిమల్ కాదని

By:  Tupaki Desk   |   27 Nov 2023 12:56 PM GMT
యానిమల్ ని మించి వైలెన్స్.. మహేష్ సినిమాపై సందీప్ కామెంట్..!
X

అర్జున్ రెడ్డి సినిమాతోనే తన డైరెక్షన్ టాలెంట్ తో ఆడియన్స్ అవాక్కయ్యేలా చేసిన సందీప్ రెడ్డి ఆ సినిమానే హిందీలో కబీర్ సింగ్ అంటూ రీమేక్ చేసి అక్కడ సత్తా చాటారు. లేటెస్ట్ గా రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే యానిమల్ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైన ప్రతిసారి ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ చేయాల్సిన కథ అని ఆయన రిజెక్ట్ చేస్తేనే రణ్ బీర్ కపూర్ కి చెప్పి సందీప్ ఈ సినిమా చేశాడని వార్తలు వచ్చాయి.

అయితే దీనికి సందీప్ వంగ క్లారిటీ ఇచ్చారు. తాను మహేష్ తో చేయాలనుకున్న సినిమా యానిమల్ కాదని. దానికి డెవిల్ అనే టైటిల్ అనుకున్నానని. ఆ సినిమా యానిమల్ కన్నా ఇంకా వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని అన్నారు సందీప్ రెడ్డి వంగ. సో యానిమల్ కథ మహేష్ కాదన్నాడు అందుకే సందీప్ బాలీవుడ్ హీరోతో ఈ సినిమా చేశాడన్న రూమర్ కి ఫుల్ స్టాప్ పడినట్టే.

సందీప్ హీరోల లిస్ట్ లో మహేష్ కూడా ఉన్నాడు. అయితే యానిమల్ తర్వాత సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ సినిమా ఉండే అవకాశం కనిపిస్తుంది. యానిమల్ తో సందీప్ హిట్ కొడితే ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ హీరోలంతా కూడా అతని వెంట పడటం కన్ ఫర్మ్.

అందరు దర్శకులు ఒక దారిలో వెళ్తే దాన్ని దాటి సినిమాలు చేస్తున్న సందీప్ వంగా కచ్చితంగా ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. యానిమల్ మహేష్ కోసం రాసిన కథ అని వార్తలు రాగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా అర్రె మంచి సినిమా మిస్ అయ్యామే అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ మహేష్ కి చెప్పిన కథ ఇది కాదని సందీప్ క్లారిటీ ఇచ్చేసరికి రిలాక్స్ అయ్యారు. ఏది ఏమైనా సందీప్ తో మహేష్ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.