మెగాస్టార్ ఛాన్సిస్తే అలాంటి సినిమా చేస్తా: సందీప్ వంగా
ఇక దర్శకుడు రాజమౌళి సైతం తనకు ఇష్టమైన దర్శకులలో సందీప్ ఒకరు అని డైరెక్ట్ గానే చెప్పేసాడు
By: Tupaki Desk | 9 Dec 2023 10:10 AM GMTఅర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వద్ద క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అనిమల్ సినిమాతో అంతకుమించి అనేలా అతనికి డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ దర్శకుడితో సినిమా చేయాలి అని ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కూడా అతని మీద ఇష్టంతోనే యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక దర్శకుడు రాజమౌళి సైతం తనకు ఇష్టమైన దర్శకులలో సందీప్ ఒకరు అని డైరెక్ట్ గానే చెప్పేసాడు. కేవలం రెండు సినిమాలతోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సందీప్ రెడ్డి కథ చెబితే వినడానికి ఇప్పుడు చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే ప్రతి దర్శకుడికి కూడా మెగాస్టార్ లాంటి హీరోతో వర్క్ చేయాలి అని కోరికగా ఉంటుంది. ఇక సందీప్ ఇంటర్వ్యూలలో తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని చాలా క్లియర్ గా చెప్పాడు.
అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో అభిమానం అని తెలియజేశాడు. అయితే ఇప్పుడు అనిమల్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా అదే విషయాన్ని చెబుతున్న ఈ దర్శకుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవితో ఒక అవకాశం వస్తే సినిమా చేస్తానని అంటున్నాడు. ఇక ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా సందీప్ చాలా క్లియర్ గా ఉన్నాడు.
చిరంజీవి గారితో యాక్షన్ డ్రామా సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని కోరికను బయటపెట్టేసాడు. ఒక విధంగా ఇలాంటి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని కూడా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మెగాస్టార్ కూడా నేటి యువతరం దర్శకులు మంచి కథతో మెప్పిస్తే చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్టత ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక సందీప్ రెడ్డి లాంటి మంచి దర్శకుడు కథ చెబితే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం సందీప్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. ఇక ఆ తర్వాత బన్నీ ఎలాగో రెడీ అన్నాడు. అనంతరం మహేష్ బాబుతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి వీరి తర్వాత సందీప్ రెడ్డి చిరంజీవితో సినిమా చేస్తాడో లేదో చూడాలి.