Begin typing your search above and press return to search.

5-10 ఏళ్ల పాటు 'యానిమ‌ల్' ప్ర‌భావం చూస్తారు!- అనురాగ్

యానిమ‌ల్ దర్శ‌కుడు సందీప్ వంగాపై బాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఇంత‌కుముందు నెగెటివ్ గా కామెంట్లు చేసారు

By:  Tupaki Desk   |   16 May 2024 2:30 AM GMT
5-10 ఏళ్ల పాటు యానిమ‌ల్ ప్ర‌భావం చూస్తారు!- అనురాగ్
X

యానిమ‌ల్ దర్శ‌కుడు సందీప్ వంగాపై బాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఇంత‌కుముందు నెగెటివ్ గా కామెంట్లు చేసారు. కానీ ఆ త‌ర్వాత త‌న త‌ప్పును తెలుసుకున్నాన‌ని.. స‌రి చేసుకున్నాన‌ని చెప్పాడు. ఇప్పుడు మ‌రోసారి సందీప్ వంగాని పొగ‌డకుండా ఉండ‌లేక‌పోయాడు. 800కోట్ల క్ల‌బ్‌లో చేరిన 'యానిమ‌ల్'ని తెర‌కెక్కించిన సందీప్ వంగా ప‌నిత‌నం అత‌డిని నిజంగానే డిస్ట్ర‌బ్ చేసింద‌న‌డానికి తాజాగా అత‌డి సంభాష‌ణ‌లు వింటే చాలు.

అనురాగ్ ఇటీవ‌ల సందీప్ వంగాతో త‌న ఇంట‌రాక్ష‌న్ గురించి మాట్లాడుతూ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. సందీప్ వంగాతో సుదీర్ఘంగా మాట్లాడిన‌ అనురాగ్ కశ్యప్ అత‌డిపై ప్రశంసలు కురిపించారు. ''నేను అతడిని (సందీప్ రెడ్డి వంగా) కలిశాను.. నేను అతడిని ఇష్టపడ్డాను. నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అతడి చిత్రం (యానిమ‌ల్‌) గురించి అతడితో మాట్లాడాలనుకున్నాను. నేను అతడిని ఆహ్వానించాను.. నేను చాలా స‌మ‌యం గడిపాను. ఐదు గంటల సంభాషణ .. నేను ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాను... దేవ్ డి (2009) తర్వాత చాలా మంది వ్యక్తులు 'స్వచ్ఛ‌దంగా ఉన్న చిత్రం' తీసినందుకు నన్ను నిషేధించారు.. నేను తరచుగా వ్యక్తులను వేరుచేయడం చూశాను. ఎవరైనా ఒకరిపై దాడి చేయడం అలా కాదు..''అని అతడు చెప్పాడు.

పరిశ్రమపై యానిమ‌ల్ సినిమా ప్రభావాన్ని హైలైట్ చేస్తూ కశ్యప్ ఇలా అన్నారు. ''ఈ మనిషి (సందీప్).. అవును మీరు చూసేది అతడినే. ప్రజలు యానిమల్‌ని ఇష్టపడవచ్చు.. లేదా ఇష్టపడకపోవచ్చు. కానీ యానిమల్ మేకింగ్ సినిమాల‌ను రూపొందించే విధానంలో ఒక ప్రధాన టెక్టోనిక్ ఛేంజ్‌. 5-10 సంవత్సరాల పాటు దీని ప్రభావం ప‌రిశ్ర‌మలోని వ్య‌క్తుల‌పై ఉంటుంది. యానిమల్ తర్వాత ప్రతి యాక్షన్ సినిమా ఫేక్‌గా కనిపిస్తుంది. ఇటీవ‌లే వ‌చ్చిన‌ బడే మియాన్ చోటే మియాన్ (అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ నటించిన)లోని ఆ ఫ్లిప్‌లు- ఫైట్‌లు అన్నీ ఫేక్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఏదో ఒకవిధంగా ఆ చిత్రంలో (యానిమ‌ల్‌)ని సంగీతం ప్రభావం చూపింది. సినిమాలోని సాంకేతిక విష‌యాలు ప్రభావం చూపాయి. యానిమ‌ల్ లోని ప్ర‌తి విష‌యం ఇత‌ర‌ సినిమాల‌పై ఎప్పటికీ ప్రభావం చూపుతాయి.. అని అన్నారు.

జనవరిలో అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో సందీప్ వంగాను కలిసినప్ప‌టి ఫోటోలను షేర్ చేసారు. ''అత‌డిని తప్పుగా అర్థం చేసుకున్నాను.. అత‌డిపై త‌ప్పుడు తీర్పునిచ్చాను'' అని రియ‌లైజ్ అయిన‌ట్టు చెప్పారు. సందీప్ వంగా నిజాయితీని అత‌డి ప‌నిని ప్రశంసించాడు. సందీప్ వంగా తన సినిమాపై ఎదురైన‌ విమర్శలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడని కశ్యప్ పేర్కొన్నాడు. నిజంగా ధైర్యంగా ఎదుర్కోగల స‌మ‌ర్థంగా మాట్లాడగల వ్యక్తి సందీప్. దయచేసి విమర్శించేవాళ్లు యానిమ‌ల్ తో ఉన్న సమస్యల గురించి అతడితో మాట్లాడండి... హిందీ సినిమా అతిపెద్ద గేమ్ ఛేంజర్ యానిమ‌ల్.. ఎక్కువ కాలం దాని ప్రభావం (మంచి లేదా చెడు) ఉంటుంది'' అని అన్నారు.