Begin typing your search above and press return to search.

సందీప్ వంగా.. తక్కువ స్పీడ్ లో ఎక్కువ క్రేజ్!

తీసింది రెండే సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో దక్కించుకున్నారు. అయితే సందీప్ వంగా వర్క్ స్పీడ్ పెరిగితే ఇంకా బాగుంటుందని సినీ ప్రియులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 3:30 PM GMT
సందీప్ వంగా.. తక్కువ స్పీడ్ లో ఎక్కువ క్రేజ్!
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ఆయన.. వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఆయన డైరెక్షన్ లో మూవీ వస్తుందంటే చాలు.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అనేలా ముద్ర వేసుకున్నారు. తన అప్ కమింగ్ మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్క్ చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సందీప్ వంగా ఎన్నో స్పెషాలిటీస్ తో తీయనున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్లు అనౌన్స్మెంట్ రావడంతో ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే సందీప్ వంగా సినిమాలకు వసూళ్లు ఎలా వస్తాయో.. విమర్శలు కూడా అలానే వస్తాయి. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆయన వర్క్ పై కామెంట్స్ చేశారు. కానీ వాటితో సంబంధం లేకుండా ఆయన తీసిన సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి.

అది పక్కన పెడితే.. సందీప్ వంగా డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడేళ్లు పూర్తైన విషయం తెలిసిందే. అంటే ఆయన డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు కంప్లీట్ అయినట్లే. అయితే ఇన్నేళ్లలో సందీప్ తీసిన సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి.. మరొకటి రణ్ బీర్ కపూర్ యానిమల్. మధ్యలో కబీర్ సింగ్ తీసినా.. అది అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కాబట్టి స్పెషల్ గా తెరకెక్కించినట్లు పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు.

తీసింది రెండే సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో దక్కించుకున్నారు. అయితే సందీప్ వంగా వర్క్ స్పీడ్ పెరిగితే ఇంకా బాగుంటుందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఆయన చేతిలో ఉన్న స్పిరిట్, యానిమల్-2 తీయడానికి మరో ఐదేళ్లు పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా చూసుకుంటే 12 ఏళ్ల కెరీర్ లో వంగా నాలుగు సినిమాలే తీసినట్లు అవుతుందని అంటున్నారు. కాబట్టి వర్క్ లో కాస్త స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేయాలని కోరుతున్నారు.

అయితే వర్క్ స్పీడ్ చూసుకుంటే.. స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ పరిస్థితి కూడా అదే. తమ సినిమాలను కొన్నేళ్లపాటు తెరకెక్కిస్తారు. కానీ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చి సూపర్ హిట్స్ అందుకుంటారు. వాళ్లతో పోలిస్తే సందీప్ వంగా.. తక్కువ బడ్జెట్ తోనే సినిమా తీస్తారు. టైమ్ ఎక్కువ తీసుకున్నా బడ్జెట్ మాత్రం తక్కువే. ఏదేమైనా ఎవరి టాలెంట్ వాళ్ళది. అలా కంపేర్ చేయకూడదన్నది నిజం. మొత్తానికి సందీప్ వంగా తన నెక్స్ట్ సినిమాలను వేగంగా తీసుకొస్తారో లేదో వేచి చూడాలి.