Begin typing your search above and press return to search.

సందీప్ వంగ ప్రభాస్ ని మాత్రం ఎలా వదులుతాడు..?

యానిమల్ తో నేషనల్ లెవెల్ గా తన గురించి మాట్లాడుకునేలా చేసిన సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడని తెలిసిందే

By:  Tupaki Desk   |   20 April 2024 6:07 AM GMT
సందీప్ వంగ ప్రభాస్ ని మాత్రం ఎలా వదులుతాడు..?
X

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చేసిన 3 సినిమాలతోనే దర్శకుడిగా పాన్ ఇండియా లెవెల్ లో తన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగ ఈ తరం దర్శకులందరికీ షాక్ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మ్యాడ్ నెస్ తో పిచ్చెక్కిస్తున్నాడు. సినిమాను ఇలా కూడా తీయొచ్చా.. హీరోని ఇలా కూడా చూపించొచ్చా అనే కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు. అఫ్కోర్స్ అవి కొందరు ఆడియన్స్ కు నచ్చట్లేదు అది వేరే విషయం. ఏది ఏమైనా కమర్షియల్ సినిమాకు కావాల్సిన రిచ్ నెస్.. హీరో క్యారెక్టరైజేషన్ వేరియేషన్స్ తన సినిమాల్లో చూపిస్తూ అదరగొట్టేస్తున్నాడు సందీప్ వంగ.

యానిమల్ తో నేషనల్ లెవెల్ గా తన గురించి మాట్లాడుకునేలా చేసిన సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడని తెలిసిందే. స్పిరిట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే సందీప్ వంగ సినిమాల్లో హీరోల పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే. అర్జున్ రెడ్డి టైంలో విజయ్ దేవరకొండకు అసలు ఎలాంటి ఇమేజ్ లేకపోయినా తన క్యారెక్టరైజేషన్ తో ఇంప్రెస్ చేసేలా సందీప్ మ్యాజిక్ చేశాడు.

అలాంటిది పాన్ ఇండియా హీరో బాహుబలి ప్రభాస్ తో సందీప్ ఎలాంటి సినిమా చేస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ తో వీర లెవెల్ లో రొమాన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నాడట సందీప్ వంగ. అతని సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బోల్డ్ గా ఉంటుందో తెలిసిందే. ఆ బోల్డ్ నెస్ లో హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా అదే రేంజ్ లో చిత్రీకరిస్తారు. సో ప్రభాస్ కెరీర్ లో ది బెస్ట్ రొమాన్స్ గా స్పిరిట్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

సందీప్ వంగ ప్రభాస్ లో కొత్త యాంగిల్ ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. స్పిరిట్ పై ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి ఒక మెట్టు పైనే ఉంటుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు సందీప్ వంగ. ప్రభాస్ లోని మాస్ యాంగిల్ తో పాటుగా తన మార్క్ క్రేజీ స్టోరీ టెల్లింగ్ తో స్పిరిట్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. తప్పకుండా స్పిరిట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని చెప్పొచ్చు.