Begin typing your search above and press return to search.

సందీప వంగా.. బన్నీ ఎంత నమ్మాడంటే..

తాజాగా సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి అసలు విషయం రివీల్ చేశారు. బన్నీ కోసం సందీప్ ఇంకా ఎలాంటి కథ రెడీ చేయలేదని తేల్చేశాడు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:09 AM GMT
సందీప వంగా.. బన్నీ ఎంత నమ్మాడంటే..
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. యానిమల్ రిలీజ్ తర్వాత సందీప్ రెడ్డి మరల టి-సిరీస్ లోనే డార్లింగ్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించి స్టొరీ రెడీగా ఉందని, డైలాగ్స్, స్క్రీన్ ప్లే రెడీ చేయాలని తాజాగా సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. యానిమల్ రిలీజ్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో మూవీ షూటింగ్ ఉంటుందని ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక మూవీ చేయడానికి సందీప్ రెడ్డి డిసైడ్ అయిన సంగతి తెలిసిందే.

టి-సిరీస్ లోనే ఈ సినిమా ఉంటుందని గతంలో అఫీషియల్ గా ఎనౌన్స్ కూడా చేసేశారు. బన్నీకి సందీప్ రెడ్డి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు అని అందరూ భావించారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి అసలు విషయం రివీల్ చేశారు. బన్నీ కోసం సందీప్ ఇంకా ఎలాంటి కథ రెడీ చేయలేదని తేల్చేశాడు. కేవలం వారిద్దరూ మాట్లాడుకొని సినిమాని ఎనౌన్స్ చేశారని క్లారిటీ ఇచ్చారు.

స్పిరిట్ మూవీ కంప్లీట్ తర్వాత అల్లు అర్జున్ కోసం సందీప్ రెడ్డి కథని సిద్ధం చేస్తారని చెప్పారు. దీంతో సందీప్ రెడ్డి కంప్లీట్ గా స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అర్జున్ కి వినిపిస్తేనే ఆ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. పుష్ప 2 షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నాడు.

ఆ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాని బన్నీ సెట్స్ పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని కరెక్ట్ గా జరిగితే 2025 ఆఖరులో సందీప్ తో బన్నీ సినిమా ఉండే అవకాశం ఉంది.