సందీప్ వంగా.. ప్రభాస్ కంటే ముందు మరో బీభత్సం
కథ, కథనంలో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా సందీప్ రెడ్డి వంగా చెప్పాడు.
By: Tupaki Desk | 19 Jan 2024 12:15 PM GMTసందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా హిందీలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ యానిమల్. ఈ సినిమా మీద ఎన్ని విమర్శలు వచ్చాయో అంతకు మించిన రెట్టింపు ప్రజాధారణ పొందింది. ముఖ్యంగా ప్రేక్షకులు యానిమల్ సినిమాని ఆదరించడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. కథ, కథనంలో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా సందీప్ రెడ్డి వంగా చెప్పాడు.
ఇది చాలా మందికి నచ్చలేదు. ఎవరికి నచ్చిన నచ్చకపోయిన ఆడియన్స్ కి అయితే బాగా నచ్చింది. అందుకే 900 కోట్ల వరకు కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ఉంటుందని క్లైమాక్స్ లో లీడ్ ఇచ్చారు. అయితే ప్రభాస్ తో స్పిరిట్ కంప్లీట్ చేసాక యానిమల్ పార్క్ ని సెట్స్ పైకి తీసుకెళ్తామని సందీప్ రెడ్డి వంగా అన్న ప్రణయ్ రెడ్డి చెప్పారు.
అయితే దానికంటే ముందుగా యానిమల్ పార్క్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజాభాయ్ సినిమాలతో పాటు సలార్ పార్ట్2ని కూడా కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు. ఇవి పూర్తవడానికి చాలా టైం పడుతుంది. మరో వైపు రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీతో చేయాలని బ్రహ్మాస్త్ర2 ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళదు. అతను వార్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డితో పాటు రణబీర్ కపూర్ కి కూడా టైం దొరికింది. ఈ టైంని యూజ్ చేసుకొని యానిమల్ పార్క్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారంట. యానిమల్ సినిమాకి మించి బోల్డ్ అండ్ రస్టిక్ కంటెంట్ తో యానిమల్ పార్క్ సినిమా ఉంటుందని ఇప్పటికే సందీప్ నుంచి ఒక స్పష్టత వచ్చింది. రణబీర్ కపూర్ కూడా తనలో గ్రే షేడ్స్ ని మరోసారి ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
దీంతో ఈ మూవీ త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే మాట బిటౌన్ లో వినిపిస్తోంది. ఒక వేళ యానిమల్ పార్క్ సినిమా వస్తే మాత్రం కచ్చితంగా బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని టచ్ చేసే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.