Begin typing your search above and press return to search.

మాట‌ల‌తోనే మ‌గువ‌ల మ‌న‌సు దోచిన వంగా

'అర్జున్‌రెడ్డి' రీమేక్ `కబీర్‌సింగ్‌`తో బాలీవుడ్‌లో విజయాన్ని అందుకున్న సందీప్‌రెడ్డి వంగా ద్వితీయ ప్ర‌య‌త్నం 'యానిమల్‌'తో అంత‌కుమించి అని నిరూపించాడు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:57 AM GMT
మాట‌ల‌తోనే మ‌గువ‌ల మ‌న‌సు దోచిన వంగా
X

'అర్జున్‌రెడ్డి' రీమేక్ `కబీర్‌సింగ్‌`తో బాలీవుడ్‌లో విజయాన్ని అందుకున్న సందీప్‌రెడ్డి వంగా ద్వితీయ ప్ర‌య‌త్నం 'యానిమల్‌'తో అంత‌కుమించి అని నిరూపించాడు. యానిమ‌ల్ సుమారు 900కోట్లు పైగా వ‌సూలు చేసింది. అయితే త‌న సినిమాల్లో స్త్రీలను కించ‌ప‌రిచే స‌న్నివేశాల‌తో అత‌డు ఒక సెక్ష‌న్ లో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నాడు. హింసాత్మ‌క స‌న్నివేశాలు-ర‌క్త‌పాతం- ఘాటైన సంభాష‌ణ‌ల‌తో సినిమాని న‌డిపించే ద‌ర్శ‌కుడిగా అత‌డిపై చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇటీవలి ఇంటర్వ్యూలో సందీప్ మహిళ‌ల కోణంలో కొన్ని ఠిఫిక‌ల్ ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కొన్నాడు. మ‌హిళ‌ల్ని ఇంటి ప‌నుల‌కే కేటాయించ‌డంపై విమ‌ర్శల్ని ఎదుర్కొన్నాడు. కానీ అత‌డి ప్రతిస్పందన ఆస‌క్తిని క‌లిగించింది.''మహిళా సాధికారత సంప్రదాయ పాత్రలకు మించి విస్తరించింది. ఉద్యోగం చేయడం.. వ్యాపారంలో రాణించ‌డం.. సవాళ్లను ఎదుర్కోవడం ఇవ‌న్నీ చేస్తున్నారు. మహిళలను యోధులుగా లేదా అధ్యాపకులుగా చిత్రీకరించడం గొప్ప‌దే అయినా కానీ ఇంటి అభివృద్ధికి గృహిణుల ముఖ్యమైన పాత్రను గుర్తించడం చాలా అవసరం. నా దృష్టిలో తల్లిగా ఉండటం చాలా ముఖ్యమైన పాత్రలలో ఒకటి. తల్లులు తమ పిల్లల జీవితాలను తీర్చిదిద్ద‌డంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ఇంట్లోనే ఉంటే తల్లిగా బాధ్యతలతో పనిని సమతుల్యం చేసుకుంటారు. ఇదంతా గొప్ప విష‌యం'' అని అన్నారు.

గృహిణి గురించి గృహిణి బాధ్య‌త గురించి సందీప్ వంగా గుర్తు చేసాడు. నిజానికి మ‌హిళ‌ల సాధికారిక‌త గొప్ప‌ది అని అంగీక‌రిస్తూనే, ఆడ‌వారు ఇంట్లో గృహిణులుగా పోషించాల్సిన పాత్ర గురించి కూడా తెలివిగా క్లాస్ తీస్కున్నాడు. ఎంతైనా అత‌డు ఘ‌టికుడు సుమీ!!