యానిమల్ పాన్ ఇండియా సక్సెస్ వెనక కారణాలు
ఇండస్ట్రీలోని చాలా డైనమిక్స్‌ని మార్చేసింది ఈ చిత్రం.
By: Tupaki Desk | 21 Aug 2024 2:45 AM GMTఇటీవలి కాలంలో పాన్ ఇండియా విజయాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పఠాన్, జవాన్, సలార్, యానిమల్, కల్కి 2989 ఏడి ఇవన్నీ పాన్ ఇండియాలో మెరుపులు మెరిపించాయి. వీటిలో సలార్ దాదాపు 800 కోట్లు వసూలు చేసింది. మిగతా సినిమాలన్నీ 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. సన్నీడియోల్ గదర్ 2 అతడి కెరీర్ బెస్ట్ హిట్.
అయితే వీటిలో కొన్ని ఓపెనింగుల రికార్డులను `స్త్రీ 2` బ్రేక్ చేసేసిందంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవికతపై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ 2 పెద్ద హిట్టయిన మాట వాస్తవం. కానీ యానిమల్ రికార్డును ఇంకా కొట్టలేదు. యానిమల్ మొదటి రోజు నెట్ సహా చాలా రికార్డులను స్త్రీ 2 బ్రేక్ చేసిందనేది ఒక ప్రచారం. అయితే ఇప్పటివరకూ స్త్రీ 2 దక్షిణాదిన యానిమల్‌ని కొట్టలేదు. అలాగే పంజాబ్ ప్రాంతంలో యానిమల్ హవా ఒక రేంజులో సాగింది. దీనికి కారణం పంజాబీ ఫ్లేవర్ ని సందీప్ వంగా ఎంతో అద్భుతంగా తెరపై చూపించడమే.
దక్షిణాదిలో సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ నైజాం, ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాలలో యానిమల్ వసూళ్లను గణనీయంగా పెంచింది. ఈ విజయం వెనక కారకుడు సందీప్ వంగా మాత్రమే. దీనికి రణబీర్ కారకుడు అని ఎవరూ చెప్పడం లేదు.
నిజానికి రెండు దశాబ్ధాల కెరీర్‌కి సమీపంలో ఉన్న రణబీర్ కి సూపర్ స్టార్ హోదాను ఇచ్చింది.. పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిష్కరించింది `యానిమల్` సినిమా మాత్రమే. ఇండస్ట్రీలోని చాలా డైనమిక్స్‌ని మార్చేసింది ఈ చిత్రం. సినిమాని శాసించినది దర్శకుడు మాత్రమేననే గుర్తింపు దక్కింది. రణబీర్‌కి ఈ సక్సెస్ వెనక క్రెడిట్ ఇవ్వడానికి ఎవరూ ఆసక్తిగా లేరు. పంజాబీ ఫ్లేవర్‌ని మిక్స్ చేసి భారతదేశం అంతటా దానిని సక్సెస్ చేయడంలో సందీప్ తెలివితేటలను మెచ్చుకోని వారు లేనేలేరు. రణబీర్ అనే స్టార్ తాను ఏం కావాలనుకున్నాడో దానిని
(ఆశించిన స్టార్ డమ్) ఇచ్చిన మొనగాడు మన సందీప్ అని కూడా టాలీవుడ్ లో చర్చ ఉంది.