Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ తో ఇతనికి పడితే మాత్రం..!

ఇక అల్లు అర్జున్ తో సినిమాకు రెడీగా లైన్ లో ఉన్నాడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ.

By:  Tupaki Desk   |   22 Jun 2024 2:30 AM GMT
అల్లు అర్జున్ తో ఇతనికి పడితే మాత్రం..!
X

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాను డైరెక్ట్ చేసే దర్శకుల గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిసిందే. పుష్ప 2 తర్వాత అసలైతే త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా ఉండాల్సింది. ఐతే గురూజీ సినిమా ఉంటుందా లేదా అన్న క్లారిటీ ఇవ్వకుండానే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో కథా చర్చలు నిర్వహించాడు బన్నీ. దాదాపు సినిమా ఓకే అనుకున్న టైం లో రెమ్యునరేషన్ లెక్కలు తేడా రావడ వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఐతే మళ్లీ ఇప్పుడు ముందు అనుకున్నట్టుగానే త్రివిక్రం తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అంటున్నారు.

ఐతే త్రివిక్రం కూడా తన ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాతో విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న త్రివిక్రం కాస్త గ్యాప్ తీసుకున్నా సరే మళ్లీ తన మార్క్ చూపించే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. సో అల్లు అర్జున్ తో సినిమా అంటే త్రివిక్రం ఇప్పుడప్పుడే రెడీ అయ్యేలా లేడని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ తో సినిమాకు రెడీగా లైన్ లో ఉన్నాడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ.

యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ లైన్ లో పెట్టిన సందీప్ వంగ యానిమల్ పార్క్ అనే మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఐతే ఈ రెండు సినిమాలను పక్కన పెట్టి ముందు అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. లేదా ప్రభాస్ తో స్పిరిట్ ని పూర్తి చేసిన తర్వాత అయినా బన్నీతో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి సినిమా పడితే మాత్రం ఆ మూవీ ఎవరి ఊహలకు అందదని చెప్పొచ్చు.

విజయ్ తో చేసిన అర్జున్ రెడ్డి సినిమాను ముందు సందీప్ వంగ అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకున్నాడు. కానీ కొత్త డైరెక్టర్ అనేసరికి బన్నీ ఛాన్స్ ఇస్తాడో లేదో అని విజయ్ దేవరకొండతో కానిచ్చాడు. తన ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని భయపెట్టిస్తున్న సందీప్ వంగ అల్లు అర్జున్ తో కూడా అలాంటి విధ్వంసాన్ని సృష్టించే ఛాన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ తో సందీప్ వంగాకి పడితేనే పుష్ప 2 తర్వాత పర్ఫెక్ట్ సినిమా అవుతుందని అల్లు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.