పుష్ప 2: అల్లు ఫ్యాన్స్ కి ఇది కిక్కిచ్చే న్యూస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు.
By: Tupaki Desk | 4 Dec 2024 5:08 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న పుష్ప 2: ది రూల్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి రోజు మొదటి షో చూడాలని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ హవా దేశమంతా కొనసాగనుంది. ఇక ప్రీమియర్ షోల టిక్కెట్ రేట్లు ఎంత ఉన్నా కూడా ఫ్యాన్స్ అస్సలు తగ్గలేదు.
ఇక అల్లు ఫ్యాన్స్ కు మరో కిక్కిచ్చే గుడ్ న్యూస్ ఏమిటంటే అల్లు అర్జున్ స్వయంగా అభిమానులతో కలిసి చూడబోతున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోను డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ఐకానిక్ సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. అభిమానులతో కలిసి సినిమా చూడాలని నిర్ణయించుకోవడం ద్వారా బన్నీ మరోసారి అభిమానుల హృదయాల్లో తన ప్రత్యేక స్థానం నిలుపుకున్నారు.
గతంలోనూ అల్లు అర్జున్ అనేకసార్లు తన అభిమానుల కోసం ఈ విధంగా స్పెషల్ షోలలో కనిపించాడు. ఈసారి పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్ట్‌ను మొదటిగా అభిమానులతో కలిసి చూడడం ద్వారా ఆయన అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఈ ప్రీమియర్ షోతో అల్లు అర్జున్ తన అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడని చెప్పవచ్చు. అభిమానులు తమ అభిమాన నటుడిని తమతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తుంటే ఆనందంతో ఊగిపోతారని చెప్పవచ్చు
రికార్డ్ స్థాయి ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న పుష్ప 2 కి ఈ ఈవెంట్ మరింత హైప్ తెచ్చే అవకాశం ఉంది. సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్ విశేషాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఇది అల్లు అర్జున్ సినిమాలకు ఇది స్పెషల్ థియేటర్. పుష్ప 1 కూడా ఇక్కడే ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. అలాంటి మాస్ థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమాను చూడటం ఈ చిత్రం విడుదల వేడుకను మరింత గుర్తుంచుకునేలా చేస్తుంది.
ఇదే సమయంలో, పుష్ప 2 ప్రీమియర్ షోకు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల ఫోకస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ నటన, సుకుమార్ మేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వంటి హైలైట్స్ సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. ఈ ప్రీమియర్ షో ఫస్ట్ టాక్ సినిమా విజయాన్ని ముందుగానే హైలెట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి, అల్లు అర్జున్ తన అభిమానులకు ఇస్తున్న ఈ అద్భుతమైన అనుభూతి పుష్ప 2 చిత్ర విజయాన్ని మరింత హై లెవెల్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. రాత్రి 9:30 గంటలకు సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్ పుష్పరాజ్ మేనియాతో రగలిపోనుంది. ఇక అభిమానుల స్పందన ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో పెరిగిపోతోంది.