గుర్తు పట్టారా... కాంచన ను మించాడుగా...!
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ఆరంభించిన చాలా మంది దర్శకులుగా నటులుగా మారుతున్న విషయం తెల్సిందే
By: Tupaki Desk | 17 Nov 2023 4:11 PM GMTకొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ఆరంభించిన చాలా మంది దర్శకులుగా నటులుగా మారుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ కూడా మొహానికి మేకప్ వేసుకుని నటుడిగా తెరంగేట్రం కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అతడు ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు.
తమిళ్ సినీ ప్రేమికులకు ముఖ్యంగా విజయ్ అభిమానులకు కొరియోగ్రాఫర్ శాండీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ కి అత్యంత ఇష్టమైన కొరియోగ్రాఫర్ అంటూ శాండీ పేరు దక్కించుకున్నాడు. అంతే కాకుండా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి కూడా శాండీ అంటే ప్రత్యేకమైన అభిమానం అని గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయింది.
తాజాగా శాండీ ట్రాన్స్ జెండర్ గా రోజీ అనే సినిమాను చేశాడు. వైవిధ్యభరిత పాత్ర అవ్వడంతో శాండీ కి నటించేందుకు పుష్కలంగా స్కోప్ దక్కింది. ఆ అవకాశంను ఫుల్ గా వాడేసుకుంటూ కుమ్మేస్తున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ట్రాన్స్ జెండర్ అంటే కాంచన సినిమాలోని లారెన్స్ గుర్తుకు వచ్చేవాడు. కాంచనను డామినేట్ చేసే విధంగా రోజీ లో శాండీ ఉన్నాడని కొందరు అంటున్నారు.
ఫస్ట్ లుక్ లో శాండీ ని ఆయన అభిమానులు కూడా టక్కున గుర్తించడానికి లేకుండా ఉన్నాడు. బాబోయ్ మరీ ఇంతగా మారాడా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ లోకేష్ కనగరాజ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ను పూరి జగన్నాధ్ కు అంకితం అవ్వడం కొసమెరుపు.