సంఘవి పెళ్లిలో చాలా ట్విస్టులున్నాయే!
అయితే తలపతి విజయ్ సరసన నటించిన సినిమా సంఘవి కెరీర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 4 Oct 2023 11:30 PM GMTకన్నడ నటి సంఘవి టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించారు. 'తాజ్ మహల్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంఘవి అటుపై 'ఊరికి మొనగాడు'.. 'తాత మనవ డు'..'ఓహా నాపెళ్లంట' లాంటి సినిమాల్లో నటించారు. అయితే 'సింధూరం' సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. నటిగా ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రమది. అటుపై 'సూర్యవంశం'.. 'నాయుడుగారి కుటుంబం'..'సరదా బుల్లోడు' ..'సమరసింహారెడ్డి'..'సీతారామరాజు' లాంటి చిత్రాలతో పాటు కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో తిరుగులేని నటిగా కొనసాగారు.
కోలీవుడ్ లోనూ చాలా సినిమాలు చేసారు. చివరిగా తెలుగులో 2005లో 'ఒక్కడే కానీ ఇద్దరు' సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. ఇక మూడు నాలుగేళ్లగా ఇతర భాషలోనూ సినిమాలు చేయలేదు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఆసక్తికర విషయాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆమె కూడా ఆర్దిక కష్టాల జయించేందుకే సినిమాల్లోకి వచ్చారు. అయితే తలపతి విజయ్ సరసన నటించిన సినిమా సంఘవి కెరీర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
తనయుడు విజయ్ ని హీరోగా..సంఘవిని హీరోగా పెట్టి చంద్రశేఖర్ ఓ సినిమా డైరెక్ట్ చేసారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు సినిమాలు తీసారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని ప్రచారం సాగింది. అది నచ్చని విజయ్ తండ్రి కారణంగా సంఘవికి కోలీవుడ్ లో అవకాశాలు లేకుండా చేసారని ప్రచారం సాగింది. ఇక రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే 'శివయ్య' సినిమాని డైరెక్ట్ చేసిన సురేష్ వర్మతో ప్రేమలో పడింది.
అటుపై వివాహ బంధంతో 2000 లో ఒకటయ్యారు. అయితే ఈ పెళ్లి సంఘవి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో తెగ దెంపులు చేసుకుని వచ్చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గడం...ఏడాదికే భర్తతో వివాదలు మొదలయ్యాయి.
దీంతో ఇద్దరు విడాకులతో వేరయ్యారు. సురేష్ వర్మ వ్యక్తిగత టార్చర్ కారణంగానే విడాకులు తీసుకున్నారు అన్నది అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకి తల్లి ఓ ఎన్ ఆర్ ఐ సంబంధం చూసిందిట. కానీ కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. అటుపై కర్ణాటకకి చెందిన ఐటీ సంస్థ అధినేత వెంకటేషన్ ని 2016లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ దంపతులుకు మైసూర్ లో స్థిరపడ్డారు.