Begin typing your search above and press return to search.

విడాకుల గురించి సానియా మిర్జా హింటు?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:29 AM GMT
విడాకుల గురించి సానియా మిర్జా హింటు?
X

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో వివాహ బంధం నుంచి విడిపోతున్నారంటూ పుకార్లు షికార్ చేసాయి. కానీ దానిని ఆ ఇరువురిలో ఎవ‌రూ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. పైగా ఆ ఇద్దరూ క‌లిసి పాకిస్తానీ టీవీ చానెల్ రియాలిటీ షో కోసం ప‌ని చేసారు. విడాకుల రూమ‌ర్ల నేప‌థ్యంలో ఈ షోకి ఈ జంట హోస్ట్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది.

ఈ సెల‌బ్రిటీ క‌పుల్ విడాకుల పుకార్లు మొదట్లో 2022లో వెలువడ్డాయి. సానియా - షోయబ్‌ల వివాహం ఒక సవాలు దశలో ఉందని ఊహాగానాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ జంట దుబాయ్‌లో విడివిడిగా నివసిస్తున్నారని, వారి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌కు సహ-తల్లిదండ్రులుగా ఉంటున్నారని పుకార్లు ఉన్నాయి.

ఇంత‌లోనే సానియా తాజా ఇన్‌స్టా పోస్ట్ వివాహం - విడాకుల సవాళ్లను ప్రతిబింబిస్తూ క‌వితాత్మ‌కంగా సాగ‌డంతో మ‌రోసారి పుకార్ల‌కు అవ‌కాశ‌మిచ్చిన‌ట్ట‌యింది. సానియా ఈ పోస్ట్‌లో పెళ్లి క‌ష్టం.. విడాకులు క‌ష్టం.. నీ దారిలో నువ్వే ఎంచుకో! అని రాసింది. ఆమె జీవిత ఎంపికల కష్టాలను, సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థిక వ్య‌వ‌హారాలు, క‌మ్యూనికేషన్ లోని సవాళ్ల గురించి ఈ క‌విత‌లో ప్ర‌స్థావించింది.

ఈ సందేశం పూర్తి సారాంశం ఇలా ఉంది. ''వివాహం కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. ఊబకాయం కష్టం. ఫిట్‌గా ఉండటం కష్టం. మీ హార్డ్ ఏమిటో ఎంచుకోండి. అప్పులు చేయడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి'' అని రాసింది.

విడాకుల పుకార్లు చాలా కాలంగా ఉన్నా కానీ, సానియా- సోయ‌బ్ చాలా కాలంగా బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. షోయ‌బ్ ని ఇదే విష‌య‌మై ప్ర‌శ్నిస్తే వ్య‌క్తిగ‌త విష‌యాల్లో ఇత‌రుల జొర‌బాటు స‌రికాని వారించాడు. తాను - సానియా విడిపోవడాన్ని ప్రైవేట్ విషయంగా ఉంచాలని ఎంచుకున్నామని, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని భావించిన‌ట్టు నొక్కి చెప్పారు. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ 2010లో హైదరాబాద్‌ తాజ్ కృష్ణలో జరిగిన విలాసవంతమైన పెళ్లితో ఒక‌ట‌య్యారు. అక్టోబర్ 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు.