Begin typing your search above and press return to search.

పరిణీతి పెళ్లిలో సానియా మిర్జా హల్‌చ‌ల్

పరిణీతి చోప్రా రాజ్యసభ ఎంపీ, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24 న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 4:02 PM GMT
పరిణీతి పెళ్లిలో సానియా మిర్జా హల్‌చ‌ల్
X

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వెడ్డింగ్ లైవ్ అప్‌డేట్‌లు హీట్ పుట్టిస్తున్నాయి. పరిణీతి చోప్రా రాజ్యసభ ఎంపీ, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24 న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. మే 23న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వరుడు తన బరాత్‌తో పడవలో వేదికకు వచ్చాడు. ఉత్సవాలు ముగిసిన తరువాత, వేడుకలు క్రమంలో సాగాయి.

ఈ పెళ్లికి ఆప్ నాయ‌కుడు, దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అటెండ‌య్యారు. ఇక ఇదే పెళ్లిలో హైద‌రాబాదీ బ్యూటీ సానియా మీర్జా బోలెడంత సంద‌డి చేసింది. సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మిర్రర్ సెల్ఫీ ని షేర్ చేసింది. ఈ ఫోటో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. మాజీ టెన్నిస్ స్టార్ సానియా పారీకి ఎంతో గొప్ప క్లోజ్ ఫ్రెండ్. అందుకే పరిణీతి-రాఘవ్ (రాగ్నీతి) వివాహానికి తన సోదరి ఆనంతో కలిసి హాజరైంది.

స్నేహితులు- కుటుంబ సభ్యుల సమక్షంలో పరిణీతి చోప్రా -రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. సాయంత్రం లీలా ప్యాలెస్ దివ్యంగా వెలిగిపోయింది. వివాహ ఆచారాలు మొత్తం ఇక‌ ముగుస్తాయి. వివాహ ఆచారాలు ముగిసిన తర్వాత, కొంతమంది అతిథులు లీలా ప్యాలెస్ నుండి తాజ్ లేక్ ప్యాలెస్‌కు స్పీడ్ బోట్‌లలో బయలుదేరారు. రాగ్నీతి వివాహంలో డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా సంద‌డి అంతా ఇంతా కాదు. రాఘవ్ చద్దాతో వివాహానికి పరిణీతి చోప్రాను స్టైల్ చేసిన మనీష్ మల్హోత్రా, ఉదయపూర్‌లోని వేదిక వద్ద పోజు కొట్టడం కనిపించింది. పరిణీతి చోప్రా తన సంగీత వేడుక నుండి స్పెష‌ల్ డిజైన‌ర్ దుస్తులలో అందంగా కనిపించింది. చాలా ఫోటోల‌లో త‌న వివాహానికి విచ్చేసిన అతిథుల‌తో ప‌రిణీతి క‌నిపించింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాగ్నీతి పెళ్లి వేడుకలో అదరగొట్టారని టాక్ ఉంది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రాఘవ్-పరిణీతి వివాహ వేడుకలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సఫా ధరించి క‌నిపించారు. అలాగే ఈ పెళ్లిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కనిపించారు. ఈ పెళ్లికి ప‌రిణీతి క‌జిన్ ప్రియాంక చోప్రా అటెండ్ కాలేక‌పోవ‌డం పెద్ద లోటు. ఇంత‌కుముందే పీసీ త‌న సోద‌రికి బెస్ట్ విషెస్ తెలియ‌జేసింది.