Begin typing your search above and press return to search.

విడాకుల త‌ర్వాత సానియా తొలిసారి ఇలా!

క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత సానియా మీర్జా ఒంట‌రిత‌నాన్ని ప్రేమిస్తోంది

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:55 PM GMT
విడాకుల త‌ర్వాత సానియా తొలిసారి ఇలా!
X

క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత సానియా మీర్జా ఒంట‌రిత‌నాన్ని ప్రేమిస్తోంది. తాను ఇంకా త‌న మ‌న‌సుకు న‌చ్చేవాడిని క‌నుగొన‌లేదు. గ్రేట్ ఇండియన్ కపిల్ షో కొత్త ప్రోమోలో టెన్నిస్ లెజెండ్ సానియా అదే విషయాన్ని ధృవీకరించింది. జాన్వీకపూర్ - రాజ్‌కుమార్ రావు నటించిన ఇటీవల విడుదలైన ఎపిసోడ్‌కు జోడించిన ప్రోమోలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తదుపరి ఎపిసోడ్‌లో సానియా మీర్జా - సైనా నెహ్వాల్‌-మేరీ కోమ్‌లకు తాను హోస్ట్ చేయనున్నట్లు కపిల్ ధృవీకరించాడు. ప్రోమోలో కపిల్ సానియా జీవితం సహా ఇంకా చాలా విషయాలే మాట్లాడాడు.

టీవీ హోస్ట్ కపిల్ ఆ ముగ్గురు మ‌హిళ‌ల‌ను పరిచయం చేస్తూ.. వారి కోసం తాను ఎంపిక చేసిన ప్ర‌శ్న‌ల గురించి ఆటపట్టించడంతో ప్రోమో ప్రారంభమైంది. సానియా - సైనాల మధ్య మేరీ కోమ్ గందరగోళానికి గురవుతుండగా, కపిల్ మేరీని ఆమె వివాహం గురించి కూడా ఆటపట్టించాడు. సానియాపై సినిమా తీస్తే షారూఖ్ ఖాన్ తన ప్రేమికురాలిగా నటించమని ఆఫర్ ఇచ్చాడని గుర్తు చేశాడు. అయితే అభి ముఝే పెహ్లే లవ్ ఇంటరెస్ట్ డుంద్నా హై (నేను మొదట ప్రేమికుడిని కనుగొనాలి) అని కపిల్‌ను కట్ చేసింది సానియా. ఈ స‌ర‌దా చిట్ చాట్‌కి న‌వ్వులు కురిసాయి.

2016లో `ఏస్ ఎగైనెస్ట్ ఆడ్స్` పేరుతో షారూఖ్ సానియా మిర్జా బ‌యోగ్ర‌ఫీ పుస్త‌కాన్ని లాంచ్ చేసాడు. ఆ పుస్తకం ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించడమే కాకుండా అందులో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సానియాపై సినిమా తీస్తే అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని.. అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను.. అని అన్నాడు. ఏమో నాకు తెలియదు… ఆమె నన్ను తన ప్రేమికుడిగా న‌టించ‌టానికి అనుమతిస్తుందా? త‌న‌ను అడగండి. కానీ నేను ఈ బ‌యోపిక్ ని క‌చ్చితంగా నిర్మిస్తాను! అని లాంచింగ్ ఈవెంట్ లో అన్నాడు. మ‌రోవైపు సానియా తన మాజీ భర్త షోయబ్ మాలిక్ మూడవసారి వివాహం చేసుకున్న కొన్ని నెలల తర్వాత తన ల‌వ్ లైఫ్ పై వ్యాఖ్యానించింది. మాలిక్ ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి అందరినీ షాక్‌కి గురిచేశారు.

టెన్నిస్ స్టార్ సానియా 2010లో హైదరాబాద్‌లో షోయబ్‌ను వివాహం చేసుకుంది. వారి వలీమా వేడుక పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జరిగింది. వారు 2018లో ఒక మగబిడ్డను స్వాగతించారు. అతడికి ఇజాన్ మీర్జా మాలిక్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో సానియా బృందం ఈ జంట చాలా నెలలుగా విడిపోయిందని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఊహాగానాలు సాగించాల్సిన ప‌ని లేద‌ని అభిమానులను కోరారు.