Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కు ఆ హీరోయిన్ ఫుల్ సపోర్ట్!

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Dec 2024 10:40 AM GMT
అల్లు అర్జున్ కు ఆ హీరోయిన్ ఫుల్ సపోర్ట్!
X

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా రోడ్ షో నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ ను అరెస్ట్‌ చేశారు.

అక్కడికి కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషుల ప్రాణాలు పోతే చూస్తే ఊరుకోమని తెలిపారు. హీరో వద్దని చెప్పినా రోడ్ షో నిర్వహించారని ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే తాజాగా తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ తో కలిసి మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటలపాటు వివిధ విషయాలపై అల్లు అర్జున్‌ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి తొక్కిసలాట కేసు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. జాతీయ మీడియాలో కూడా ఆ విషయంపై చర్చలు నడుస్తున్నాయి. వివిధ ఛానెల్స్ లో డిబేట్ లు కూడా నడిచాయి. ఆ సమయంలో నటి సంజనా గల్రానీ.. బన్నీని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. ఆయనను సమర్థిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

తొక్కిసలాట కేసును ప్రస్తావిస్తూ.. తాను కూడా వ్యవస్థకు బలి అయ్యానని సంజన తెలిపారు. ఇలాంటి కారణాలతో అరెస్ట్ అయ్యానని చెప్పారు. అందుకే బయటకు వచ్చి మాట్లాడటం నిజంగా సాహసోపేతమైన విషయమని అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యులు కారని వ్యాఖ్యానించారు. ఆయన నిందితుడు కాదని తెలిపారు.

కావాలని ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోలకు వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్లది అభిమానం కాకుండా పిచ్చి అని చెప్పవచ్చని అన్నారు. ఆ థియేటర్ కు హీరో రావడం ఇదేం మొదటిసారి కాదని తెలిపారు. మొత్తంగా ఘటనకు బన్నీ బాధ్యులు కాదని తెలిపారు. అలా ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా.. సంజన బన్నీని సమర్థించారు.