దీపిక నా నాల్గవ భార్య అయ్యుండేది.. స్టార్ హీరో పై నెటిజనుల ఫైర్
పబ్లిక్‌లో బోల్డ్‌గా మాట్లాడే హీరోల్లో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ఒకరు. అతడు కొన్నిసార్లు సహనటీమణులపై అదుపు తప్పి జోకులు పేల్చి అపహాస్యం పాలయ్యాడు.
By: Tupaki Desk | 9 Jan 2025 3:30 PM GMTపబ్లిక్‌లో బోల్డ్‌గా మాట్లాడే హీరోల్లో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ఒకరు. అతడు కొన్నిసార్లు సహనటీమణులపై అదుపు తప్పి జోకులు పేల్చి అపహాస్యం పాలయ్యాడు. ఇప్పుడు దీపిక పదుకొనేపై తన క్రష్ గురించి బహిరంగంగా వ్యాఖ్యానించి తన బోల్డ్ యాటిట్యూడ్ ని బయటపెట్టాడు. నెటిజనుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొనేంతగా అతడు ఏం మాట్లాడాడు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
సంజయ్ దత్ ఓ పబ్లిక్ మీటింగ్‌లో మీడియా ఎదుట మాట్లాడుతూ.. తాను ఇంకా చిన్నవాడై ఉంటే ప్రముఖ నటి దీపికా పదుకొనేను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసినట్టు ప్రముఖ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. సంజయ్ దత్ ఒకప్పుడు దీపికా పదుకొనే అందాన్ని ప్రశంసించారు. `ఖల్ నాయక్` లోని తన హిట్ పాట `చోలీ కే పీచే` ఈరోజు చిత్రీకరిస్తే.. దానిలో మాధురీ దీక్షిత్ కాకుండా దీపిక పదుకొనేకు అవకాశం వచ్చేదని వ్యాఖ్యానించారు. ``దీపికా పదుకొనే… ఎంతో అందంగా ఉంటుంది. నేను కొంచెం చిన్నవాడిని అయితే ఆమె నా నాల్గవ (భార్య) అయ్యేది`` అని కూడా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ఇలాంటి విషయాలను ఎలా బహిరంగంగా వ్యాఖ్యానించగలరో ఆలోచిస్తే నిజంగా భయంగా ఉంది. వాళ్ళు బహిరంగంగా ఇంత స్పష్టంగా ఉంటే, ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటారో ఆలోచిస్తే నాకు వణుకు పుడుతుందని వ్యాఖ్యానించారు. అతడు ఒకసారి కపిల్ శర్మ షోలో కృతిపై అసహ్యంగా జోక్ చేసాడు అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
సంజయ్ దత్ ఇప్పటికే మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. అతడు 1987లో తోటి నటి రిచా శర్మను వివాహం చేసుకున్నాడు. ఆ జంట వారి మొదటి బిడ్డ త్రిషాలకు జన్మనిచ్చారు. శర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. 1998లో ఎయిర్ హోస్టెస్ నుండి మోడల్‌గా మారిన రియా పిళ్లైని సంజయ్ దత్ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ విడిపోయారు. 2008లో వారి విడాకులు ఖరారైంది. అదే సంవత్సరం అతడు మాన్యతను వివాహం చేసుకున్నాడు. ఇది అతడికి మూడవ పెళ్లి. ఈ జంట 14 ఏళ్ల కవలలకు తల్లిదండ్రులు. అయితే ఇప్పటికే పెళ్లయిన దీపిక పదుకొనేని పెళ్లాడుతానని వ్యాఖ్యానించడం నెటిజనులకు నచ్చలేదు. దీపిక పదుకొనే రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకున్నారు. ఈ జంట ఒక ఆడశిషువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే