విలన్ పాత్రలన్నీ ఆయన్నే వెతుక్కుంటూ వెళ్తున్నాయా?
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ 'కేజీఎఫ్' తో సౌత్ ఇండస్ట్కీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్ 2' లో బలమైన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
By: Tupaki Desk | 26 Feb 2025 8:30 AM GMTబాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ `కేజీఎఫ్` తో సౌత్ ఇండస్ట్కీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్ 2' లో బలమైన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అక్కడ సక్సెస్ తో టాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. రామ్ హీరోగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' లోనూ విలన్ గా నటించారు. అటుపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'రాజాసాబ్`' లోనూ ఎంట్రీ ఇచ్చారు.
అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ2` లోనూ దత్ విలన్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే నిజమైతే బాలయ్య-దత్ మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లోనే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖల్ నాయక్ ని పర్పెక్ట్ గా ఎలివేట్ చేసే దర్శకుడు బోయపాటి. దత్ ఎంట్రీ నిజమైతే సినిమాకు అదనపు అస్సెట్ అని చెప్పాలి.
ఈ నేపధ్యంలో తాజాగా మెగా మేనల్లుడు హీరోగా నటిస్తోన్న 'సంబరాల ఏటిగట్టు'లో కూడా సంజయ్ దత్ ని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే దర్శకుడు రోహిత్ కెపి దత్ ని కలసి స్టోరీ వినిపించడంతో పాటు మంచి పారితోషికం ఆఫర్ చేయడంతో ఎస్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఓభారీ పైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ త్వరలోనే జాయిన్ అవుతారని సమాచారం.
ఇలా వరుస అవకాశాలతో సంజయ్ దత్ బిజీ అవ్వడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోలే తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దత్ నే అవకాశాలు వెతక్కుంటూ వెళ్లడం అన్నది అతడికే చెల్లింది. అయితే దత్ ఎంట్రీ విషయంపై ఆయా చిత్ర బృందాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.