ఇండస్ట్రీ పక్షపాతంపై కంగన మళ్లీ ఫైరింగ్
క్వీన్ కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' థియేట్రికల్ గా ఆశించినంతగా రాణించకపోయినా, ఇటీవల ఓటీటీలో విడుదలై చాలా ప్రశంసలు అందుకుంటోంది.
By: Tupaki Desk | 19 March 2025 1:56 PM ISTకంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ' సినిమా OTT విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వకపోయినా ప్రశంసలు అందుకుంటోంది. దర్శకుడు సంజయ్ గుప్తా ఈ సినిమాను ప్రశంసించారు మరియు దాని గురించి ముందస్తుగా ఆలోచించిన అభిప్రాయాలు ఉన్నాయని అంగీకరించారు. కంగనా తన పట్ల చిత్ర పరిశ్రమకు ఉన్న పక్షపాతాలను విమర్శించింది, పక్షపాతం లేకుండా మంచి పనిని అంగీకరించాలని కోరారు.
క్వీన్ కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' థియేట్రికల్ గా ఆశించినంతగా రాణించకపోయినా, ఇటీవల ఓటీటీలో విడుదలై చాలా ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను పోషించడమే కాకుండా కంగన స్వయంగా చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఓటీటీ ప్రశంసల అనంతరం కంగనలో కొత్త ఉత్సాహం వచ్చింది. పైగా దర్శకుడు సంజయ్ గుప్తా ఈ సినిమాను ఎంతో ప్రశంసించారు. ముందస్తు ఆలోచన.. మంచి అభిప్రాయాలు దాగి ఉన్నాయని అతడు ప్రశంసించారు. కంగనా ఎంత అద్భుతమైన సినిమా - నటన , దర్శకత్వం రెండూ. టాప్ నాచ్ & వరల్డ్ క్లాస్ అని ట్వీట్ చేశారు. అంతేకాదు తాను దీనిని అంచనా వేయడం(కంగన ప్రతిభను)లో విఫలమయ్యానని కూడా స్వయంగా అంగీకరించాడు.
గుప్తా వ్యాఖ్యల అనంతరం కంగన జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన సినిమాలు చూసే ముందు ముందస్తు అంచనాలు ఆలోచనలతో రాకూడదని కంగన కోరుకున్నారు. కంగన గురించి ముందస్తు ఆలోచనలు ఉన్నాయని సంజయ్ అంగీకరించిన విషయాన్ని కంగన గుర్తు చేసారు. ప్రతికూల దృష్టితో ఆలోచించకుండా నా సినిమా చూస్తే అది బాగా నచ్చుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. నా గురించి ప్రతికూలంగా మాత్రమే ఆలోచించేవారికి.. ..ఆమె విఫలమైతే బాగుండునని కోరుకునే వారికి నేను ఎలా తెలుస్తాను? అని కూడా కంగన ప్రశ్నించారు. ద్వేషం పక్షపాతాల నుంచి బయటపడి తన పనిని గుర్తించినందుకు సంజయ్ గుప్తాకు కంగన ధన్యవాదాలు తెలిపారు.