Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ని టార్చ‌ర్ చేసిన‌ డైరెక్ట‌ర్

ఈ సిరీస్ లో కొన్ని స‌న్నివేశాల కోసం సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌న‌కు క‌ఠిన ప‌రీక్ష పెట్టార‌ని, దానివ‌ల్ల ఆక‌లితో అల‌మ‌టించ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని కూడా తెలిపారు

By:  Tupaki Desk   |   5 Dec 2024 6:30 PM GMT
హీరోయిన్‌ని టార్చ‌ర్ చేసిన‌ డైరెక్ట‌ర్
X

అవును.. ఆ న‌టీమ‌ణి సెట్లో ఆక‌లితో అల‌మ‌టించాన‌ని తెలిపారు. టాప్ డైరెక్ట‌ర్ త‌న‌ను టార్చ‌ర్ పెట్టార‌ని, తిండి తిప్పలు లేకుండా చేశార‌ని తెలిపింది స‌ద‌రు హీరోయిన్. అయితే ఇదంతా త‌న సినిమాలోని స‌న్నివేశం బాగా రావ‌డం కోసం అత‌డి ప్ర‌య‌త్నం అని తెలిపింది. సెట్లో ఆక‌లితో అల‌మ‌టించిన ఈ న‌టి పేరు అదితీరావ్ హైద‌రీ. ఇటీవ‌లే భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో `హీరామండి` అనే వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ లో కొన్ని స‌న్నివేశాల కోసం సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌న‌కు క‌ఠిన ప‌రీక్ష పెట్టార‌ని, దానివ‌ల్ల ఆక‌లితో అల‌మ‌టించ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని కూడా తెలిపారు.

అదితీరావు హైదారీ ఇటీవ‌ల భ‌న్సాలీ `హీరమండి`లో బిబ్బోజాన్ అనే వేశ్య పాత్రను పోషించారు. కొన్ని సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు ముందు తాను చాలా ఆందోళన చెందాన‌ని అదితీ రావ్ తెలిపారు. అయితే అంతిమంగా త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. బిబ్బోజాన్ అనే తిరుగుబాటు దారు అయిన వేశ్య‌గా.. స్వేచ్ఛా పోరాట యోధురాలిగా అదితీ అద్భుతంగా న‌టించార‌ని కితాబు ద‌క్కింది. ఈ సిరీస్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అదితీ త‌న‌ అనుభవాల‌ గురించి తాజా చాటింగ్ సెష‌న్ లో ఓపెన‌య్యారు. భాన్సాలీ ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించాల్సిన రోజుకు ముందే అదితీని ఆకలితో ఉండాల‌ని సూచించారు. అదితీ ఈ పాత్ర‌ను ఎలా చేయగలదో చూడాలి! అందుకే త‌న‌ను మెలకువగా ఉంచడానికి ఈ శిక్ష విధించార‌ట‌.

అదితి మాట్లాడుతూ..``నేను చిన్న అమ్మాయిగా ఉన్న‌ప్పటి నుండి డ్యాన్స్ నేర్చుకుంటూ పెరిగాను. కాని ముజ్రా చాలా భిన్నమైన డ్యాన్స్. నేను భరత నాట్యం నేర్చుకున్నాను... కానీ ఇది కథక్...సంజయ్ లీలా భన్సాలీ కళ్ళ నుంచి పుట్టుకొచ్చిన కథక్. అతడు గ‌రిష్ఠంగా పరిపూర్ణతను చూస్తారు. తాను కోరుకున్న‌దానిని సరిగ్గా పొందాల‌నుకుంటారు. అతడిని నిరాశపరచడకూడ‌దు. అందువ‌ల్ల ఆ స‌న్నివేశం నిజంగా నాకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది`` అని తెలిపారు. నా పాత్ర కోసం నేను ఉత్తేజకరమైన ప్రసంగాలు ఇవ్వాల్సి వచ్చింద‌ని అన్నారు. నేను ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇవ్వవలసిన దృశ్యాల కోసం ప్రిపేర‌య్యాను. సంజయ్ సర్ నన్ను ఒక రోజు ఆకలితో ఉంచారు. ఎందుకంటే ఈ దృశ్యాలు సహజంగా రావు. ఆక‌లితో ఉన్నా కానీ నేను చాలా సంతోషంగా చేశాను. ఎందుకంటే ఆక‌లి నిజంగా నాకు సహాయపడింది… నేను నిజంగా ఈ సన్నివేశాలు బాగా రావ‌డం కోసం పోరాడాను`` అని తెలిపారు. అయితే భ‌న్సాలీ త‌న‌ను ఆక‌లితో ఉంచ‌డానికి కార‌ణం.. ఒక‌వేళ పొర‌పాటున శృంగార దృశ్యం అనుకుని ఆ పాత్ర‌లో జీవిస్తుంద‌ని భ‌య‌ప‌డిన‌ట్టు భ‌న్సాలీ కూడా తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ షో `హీరామండి` భారత స్వాతంత్య్ర‌ విప్లవం నేపథ్యంలో తెర‌కెక్కింది. ఈ సిరీస్ లాహోర్‌లోని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హీరామండి .. బ్రిటీష్ రాజ్ సందర్భంగా అధికారుల వేశ్యల మధ్య ఘర్షణను ఆవిష్క‌రించింది. ఇందులో సోనాక్షి సిన్హా, రిచా చాధ, సంజీదా షేఖ్, ఫార్డిన్ ఖాన్, తహా షా బడుష్షా, శేఖర్ సుమన్ , అధ్యాన్ సుమన్ కూడా నటించారు. హీరామండి రెండవ సీజన్ ఇప్పటికే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.