వీసా రద్దుతో ఆ దేశంపై నటుడి సెటైర్!
అజయ్ దేవగణ్, సంజయ్ దత్, ప్రధాన పాత్రల్లో విజయ్ కుమార్ ఆరోరా దర్శకత్వంలో `సన్నాఫ్ సర్దార్-2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 Aug 2024 3:30 PM GMTఅజయ్ దేవగణ్, సంజయ్ దత్, ప్రధాన పాత్రల్లో విజయ్ కుమార్ ఆరోరా దర్శకత్వంలో `సన్నాఫ్ సర్దార్-2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ యూకే లో జరుగుతోంది. ప్రధాన తారాగణమంతా అక్కడే ఉంది. అయితే మాదేశం రావడానికి వీల్లేదంటూ యూకే ప్రభుత్వం సంజయ్ దత్ వీసాని రద్దు చేసింది. దీంతో ఇప్పుడీ నిషేధం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఎలాంటి వివాదాల్లో లేని సంజయ్ దత్ పై ఇదే పంచ్ అంటూ అంత చర్చనీయాంశగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రద్దుపై సంజయ్ దత్ స్పందించారు. `వీసా మంజూరు చేసిన నెల రోజుల తర్వాత సంజయ్ దత్ జైలు జీవితం సాకుగా చూపుతూ యేకే ప్రభుత్వం వీసా రద్దు చేసింది. అన్ని పేమెంట్స్ పక్కాగా జరిగాక రద్దు చేయడం ఏంటని దత్ ప్రశ్నించారు.
ఇలాంటి రద్దు ఎక్కడా లేదని యూకే మాత్రమే అమలు చేస్తుందా? అని అసహనం వ్యక్తం చేసారు. అయినా అల్లర్లు జరుగుతోన్న ఆ దేశం ఎవరు వెళ్తారు? వెళ్లడానికి నేను కూడా సిద్దంగా లేను ` అని అన్నారు. దత్ కి మద్దతుగా ఆయన అభిమానులు నిలిచారు. యూకే చర్య ఏమాత్రం ఆమెదయోగ్యంగా లేదని...కారణం సహేతుకంగా లేదని మండి పడుతున్నారు. అలాగైతే చాలా మంది నటులపై యూకే వీసాలు రద్దు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక `సన్నాప్ సర్దార్ -2`పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామా పదేళ్ల క్రితమే వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 170 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో సీక్వెల్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త దర్శకుడు తెరపైకి రావడంతో మేకింగ్ ఎలా ఉంటుంది? అన్న సందేహం వ్యక్తమవుతోంది. గతంలో విజయ్ కుమార్ `గుడ్ డే చా`, ` కాళీ జొట్టా`, `స్ట్రీట్ డాన్సర్-3` లాంటి సినిమాలు తెరకెక్కించాడు. ఆ అనుభవంతోనే అజయ్ దేవగణ్ ఛాన్స్ ఇచ్చాడు.