ఆ మల్టీస్టారర్ లవ్ అండ్ వార్ గా!
స్టార్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ వరుసగా లవ్ స్టోరీల్ని ప్రకటిస్తూ అంచనాలు పెంచేస్తోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Jan 2024 12:30 AM GMTస్టార్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ వరుసగా లవ్ స్టోరీల్ని ప్రకటిస్తూ అంచనాలు పెంచేస్తోన్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ తో 'ఇన్షా అల్లా' అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో పాటు లవ్ స్టోరీ నేపథ్యంలో అద్భుతమైన మల్టీస్టారర్ కి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్...విక్కీ కౌశల్ హీరోలగా అలియాభట్ హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఇద్దరు దంపతుల మధ్య జరిగే ఈ స్టోరీ ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
అయితే తెరపై ఎవరు భార్య భర్తలుగా కనిపిస్తారు? అన్నది ఆసక్తికరం. రియల్ లైఫ్ లో రణబీర్-అలియా భార్యభర్తలు అని అందరికీ తెలిసిందే. కానీ రీల్ లైఫ్ లో అలియా ఎవరికి భార్యగా నటిస్తుంది? అన్నది సస్పెన్స్. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించారు. 'లవ్ అండ్ వార్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సందర్భంగా అలియాభట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఏళ్ల కల ఈ సినిమాతో నిజం కాబోతుంది. భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న గొప్ప ప్రేమ కథా చిత్రమిది.
వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్టమైన భన్సాలీతో రెండవ సారి పని చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అంది. టైటిల్ ని బట్టి ప్రేమ కోసం పెద్ద యుద్దమే జరుగు తుందని తెలుస్తోంది. ముగ్గురు మధ్య జరిగే ట్రయాం గిల్ లవ్ స్టోరీ వార్ ఇది. ఈ చిత్రాన్ని నవంబర్ లో సెట్స్ కి తీసుకెళ్లాలని భన్సాలీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రణబీర్..విక్కీ..అలియా వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
అలాగే సంజయ్ లీలా భన్సాలీ షారుక్ ఖాన్ హీరోగా ఇన్షా అల్లాని కూడా పూర్తి చేయాలి. అంటే నవంబర్ లోపు ఆ సినిమా పూర్తి చేసి తదుపరి ఈ లవ్ స్టోరీ ని సెట్స్ కి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ గత సినిమా 'గంగూబాయి కతియావాడి' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో గంగూబాయి గా అలియా భట్ అభినయించిన తీరు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.