సూపర్‌స్టార్‌తో స్టార్ డైరెక్టర్ గొడవలు నిజమా?
ఇటీవలి ఇంటర్వ్యూలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నించగా.. ఈ ప్రచారం గురించి ప్రస్థావించారు.
By: Tupaki Desk | 26 May 2024 4:30 PM GMTదిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, కండల హీరో సల్మాన్ ఖాన్ మధ్య గొడవలున్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నించగా.. ఈ ప్రచారం గురించి ప్రస్థావించారు.
అయితే సల్మాన్ తో తన రిలేషన్ గురించి భన్సాలీ చెప్పిన విషయాలు షాక్ కి గురి చేసాయి. తమ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయని, ఎటువంటి ఘర్షణ లేదని ఆ వార్తల్ని పూర్తిగా ఖండించారు. తామిరువురం తరచూ టెలిఫోనిక్ సంభాషణలలో పాల్గొంటామని, సల్మాన్ తన ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు నిరంతరం కాల్ చేస్తుంటారని వెల్లడించారు.
సల్మాన్ - సంజయ్ 'ఇన్షా అల్లా' చిత్రం కోసం కలిసి పని చేయాలనుకున్నారు. కానీ అది ఆలస్యం అయింది. సల్మాన్‌తో భన్సాలీకి కలతలు వచ్చాయని, అందుకే ఆ చిత్రం పట్టాలెక్కలేదని ప్రచారమైంది. కానీ ఆ పుకార్లను ఇప్పుడు ఇంటర్వ్యూలో భన్సాలీ తోసిపుచ్చాడు. సినిమాలతో సంబంధం లేకుండా తమ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని భన్సాలీ తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే ఆ ఇద్దరూ ఎవరికి వారు ఫుల్ బిజీ. సల్మాన్ తదుపరి మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్' ని తెరకెక్కించి మే 1 న విడుదల చేసారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ లతో 'లవ్ అండ్ వార్' చిత్రం కోసం తదుపరి భన్సాలీ ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ గతంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం కోసం పని చేసారు. సల్మాన్ మాజీ ప్రియురాలు ఐశ్వర్యరాయ్ ఇందులో కథానాయికగా నటించారు. ఆ ఇద్దరి మధ్యా విభేధాల సమయంలో భన్సాలీ కూడా కొంత మనోవేదన అనుభవించాల్సి వచ్చిందని టాక్ వినిపించింది.