Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : షేక్‌ చేస్తున్న సంజీదా అందాలు

సీరియల్స్‌లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు హీరోయిన్‌గానూ ఆఫర్లు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   29 Dec 2024 2:30 AM GMT
పిక్‌టాక్‌ : షేక్‌ చేస్తున్న సంజీదా అందాలు
X

హిందీ సినిమాలతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ముద్దుగుమ్మ సంజీదా షేక్‌. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. రెండు దశాబ్దాల క్రితం బుల్లి తెర ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. క్యా హోగా నిమ్మోకాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2007లో స్టార్‌ ప్లస్ ఛానల్‌లో వచ్చిన కయామత్‌ సీరియల్‌లో నటించి మెప్పించింది. సీరియల్స్‌లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు హీరోయిన్‌గానూ ఆఫర్లు దక్కించుకుంది.


బుల్లితెర వెండితెరపై తనదైన ముద్ర వేసిన సంజీదా అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి పింక్ డ్రెస్‌లో థైస్ అందాలను షేర్‌ చేయడంతో పాటు క్లీ వేజ్‌ షో తో మతి పోగొట్టింది. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత చేస్తున్న సంజీదా వయసు గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. చాలా మంది ఈ ఫోటోలకు పాతికేళ్ల పడుచు అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ గూగుల్‌ లెక్క ప్రకారం ఈమె వయసు ఇటీవలే నాలుగు పదుల వయసుకు చేరింది. ఈ వయసులోనూ ఇంత అందంగా కనిపించడం కేవలం ఈమెకే చెల్లింది అనడంలో సందేహం లేదు.


ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా అయిదు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా స్టార్‌ హీరోయిన్స్‌కి పోటీ అన్నట్లు తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తుంది. బాలీవుడ్‌లో అతి తక్కువ మంది మూడు పదుల వయసు దాటిన తర్వాత ఇలా అందంగా ఉంటారు. వారితో పాటు సంజీదా షేక్ చేరింది అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్నా సినిమాల్లో రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన ఆఫర్లు దక్కలేదు అనే అభిప్రాయంన వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌లో అయినా ఈమె సినిమాలు చేయాల్సింది అంటూ కొందరు అంటున్నారు.

కన్నడ, పంజాబ్‌ భాషల్లో నటించిన ఈమె ముందు ముందు సౌత్‌లో మరిన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి. హిందీలో ఈమెకు ఈమధ్య వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఫైటర్‌ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. వచ్చే ఏడాదిలోనూ ఈమె సినిమా హిందీ నుంచి రాబోతుంది. వెబ్‌ సిరీస్‌ల్లోనూ ఈమెకు మంచి గుర్తింపు లభిస్తోంది. ముందు ముందు ఈమె టీవీ షోల్లో నటించేందుకు ఆసక్తి కనబర్చుతోంది. హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించే అవకాశాలు రాకున్నా కచ్చితంగా మంచి పాత్రల్లో నటించే అవకాశాలు దక్కవచ్చు.