రష్మికపై ప్రేమ పెంచుకున్న నటి!
రష్మిక అందం నటన ఆహార్యం అన్నిటినీ పిచ్చిగా ఇష్టపడుతోంది.
By: Tupaki Desk | 29 Dec 2024 3:30 AM GMTఅవును.. ఒక నటి రష్మికతో ప్రేమలో పడింది. రష్మిక అందం నటన ఆహార్యం అన్నిటినీ పిచ్చిగా ఇష్టపడుతోంది. తనను చూసి అనునిత్యం ప్రేరణ పొందుతోంది. తాను కూడా అలా నిరూపించాలని పంతం పడుతోంది. ఇంతకీ ఎవరా నటి ? ఏమా ప్రేమ కహానీ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
బాలీవుడ్ కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి' వెబ్ సిరీస్ తో సంజీదా షేక్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఎపిసోడ్ రన్ అవుతున్నంత సేపూ పోటీబరిలో ఎందరు సీనియర్లు ఉన్నా వేశ్య పాత్రలో సంజీదా అదరగొట్టేసిందన్న ప్రశంసలు దక్కాయి. వేశ్యా గృహాలలో జీవించేసింది సంజీదా షేక్. హీరామండి చూశాక ఈ హిందీ నటి ప్రతిభను కొనియాడని వారు లేరు.
అయితే సంజీదా షేక్ ప్రముఖ దక్షిణాది నటి రష్మికతో ప్రేమలో పడ్డానని తెలిపింది. రష్మిక నటనకు పిచ్చిగా అభిమాని అయిపోయానని అంటోంది. తొలిగా 'యానిమల్'లో రష్మిక అద్బుత నటనకు ఫిదా అయిపోయానని సంజీదా తెలిపింది. అందులో రణబీర్ తో గొడవ పడే సన్నివేశంలో రష్మిక హావభావాలు, నటన మర్చిపోలేనివి అంది. రణబీర్‌తో ఆ ఒక్క సన్నివేశం తన గురించి నా ఆలోచనను మార్చివేసింది. ఆమె చాలా మంచి నటీమణుల కేటగిరీలో ఉంది. ఇటీవల నేను రష్మికను 'పుష్ప 2'లో చూశాను. తన పట్ల నా గౌరవం మరింత పెరిగింది. నాకు మంచి నటప్రదర్శనలు చూడటం ఇష్టం. పుష్ప 2 అల్లు అర్జున్ సినిమా అయితే రష్మిక ఆ చిత్రంలో ప్రత్యేకంగా నిలిచి తనదైన ముద్ర వేసింది. ఆమె తన సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించింది. ''యే మేరా హస్బెండ్ హై'' అని అందరికీ సమాధానం చెప్పే ఆ ఒక్క సన్నివేశం చాలా అందంగా ఉంది. రష్మిక నిజంగా నాపై ప్రభావం చూపింది'' అని పొగిడేసింది.
సంజీదా విషయానికొస్తే.. 2024లో హీరామండితో ప్రత్యేక గుర్తింపు పొందాక, 2025లో తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉత్సాహంతో కనిపిస్తోంది. టీవీ కోసం పని చేస్తున్నప్పుడు లీడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేయాలనుకున్నానని, నాలో పురోగతిని చూసిన తర్వాత నమ్మకంగా ఉన్నానని తెలిపింది. ఏం చేసినా మెప్పించగలననే నమ్మకం పెరిగిందని సంజీదా అన్నారు. ఈ ఏడాది విడుదలైన ఫైటర్ చిత్రంలోను ఈ భామ నటించిన సంగతి తెలిసిందే.