చెలరేగి ఆరబోసిన 'హీరామండి' వేశ్య!
ఈ సినిమా కంటే ముందే బుల్లితెరపైనా ఈ భామకు నటిగా అనుభవం ఉంది.
By: Tupaki Desk | 15 Nov 2024 8:30 PM GMTకళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి`లో ఒక వేశ్య పాత్రలో నటించింది సంజీదా షేక్. తన కంటే సీనియర్ నటీమణులతో పోటీపడి మరీ నటించింది. తనదైన అందం, నటనాభినయంతో మంత్రముగ్ధులను చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా కంటే ముందే బుల్లితెరపైనా ఈ భామకు నటిగా అనుభవం ఉంది.
హీరామండి నటి సంజీదా షేక్ వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాల్లో డిబేటబుల్ ఎలిమెంట్. ఈ బ్యూటీ ఒంటరి తల్లి. భర్తకు విడాకులిచ్చాక తన కూతురితో కలిసి నివశిస్తోంది. ఇటీవల తన మాజీ భర్త, నటుడు అమీర్ అలీ గురించి సంజీదా ఓపెన్ గా మాట్లాడారు. 2012లో పెళ్లయింది. వారికి ఐరా అలీ అనే కుమార్తె కూడా ఉంది. కానీ మనస్ఫర్థలతో సంజీదా- అమీర్ అలీ 2021లో విడిపోయారు. సంజీదా షేక్ తన జీవితంలోని సవాళ్లు, దుఃఖాన్ని అధిగమించానని, డిప్రెషన్ నుంచి బయటపడ్డానని కూడా తెలిపింది.
మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి ప్రయత్నించే భాగస్వాములు ఉన్నారు.. మీరు ఏమీ చేయలేరని మీకు చెప్తారు. లేదా మీరు దీన్ని చేయలేరు అంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. మీరు సంతోషంగా ఉన్న ప్రతి సంబంధంలో కొన్ని దశలు ఉంటాయి. ఆ దశలు దాటితే ఏం చేయాలో నిర్ణయించుకోండి. నేను నా కోసం విడిపోయాను. ఎందుకంటే నేను నన్ను ప్రేమించడం ప్రారంభించాను. నాకే ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాను. ఇది చాలా చాలా ముఖ్యమైనది! అని సంజీదా షేక్ బ్రేకప్ గురించి మాట్లాడారు.
ఒంటరి తల్లిగా ఉండటం ఎలా అనిపిస్తుంది? అని ప్రశ్నిస్తే... ఒంటరి తల్లి అంటే ఏమిటి? అని ఎదురు ప్రశ్నించారు. నేను ఒక తల్లిని. ఒక తల్లి తల్లి అని నేను అందరికీ చెప్తాను. ఒంటరిగా ఉందా లేదా అనేది పట్టింపు లేదు. నా బాధ్యతలు మారవు. ఒక తల్లిగా నేను ఏమి చేయాలో అది చేస్తాను అని అంది.
హీరమండికి ముందు `ఫైటర్`లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే లతో కలిసి కనిపించింది. జానే పెహచానే సే యే అజ్నాబి, బదల్తే రిష్టన్ కి దస్తాన్, ఇష్క్ కా రంగ్ సఫేద్ వంటి అనేక టీవీ షోలలో కనిపించింది. సోషల్ మీడియాల్లోను సంజీదా షేక్ యాక్టివ్ గా ఉన్నారు. సంజీదా తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు పెంచుతోంది. ఈ భామ గ్లామరస్ ఫోటోషూట్ వెబ్ ని వేడెక్కిస్తోంది.