హీరామండి నటి పూల్ సైడ్ ట్రీట్
తాజాగా సంజీదా ఇన్‌స్టాలో రెండు ఫోటోలను షేర్ చేసింది. మొదటి ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో నిలబడి పింక్ అండ్ గ్రీన్ స్విమ్సూట్ను ధరించి కాఫీ సిప్ చేస్తూ కనిపించింది.
By: Tupaki Desk | 1 July 2024 2:03 PM GMTఇటీవలే భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ తో పాన్ వరల్డ్ లో పరిచయమైంది నటి సంజీదా షేక్. పెద్ద డైరెక్టర్ కోడలి వల్ల సెట్లో సంజీదా చాలా ఇబ్బంది పడిందని ప్రచారమైంది. ప్రతిభావంతురాలైన సంజీదాను తగ్గించడమే కాకుండా, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బయటి వ్యక్తులు/ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వకుండా తన కోడలు షర్మిన్కే అవకాశం కల్పించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. షర్మిన్ తో విభేధాల వల్ల సంజీదా పేరు మార్మోగింది. గూగుల్ లో ఈ భామ ట్రెండింగ్ అయింది. సంజీదా ఫోటోలు, వార్తల కోసం గూగుల్ ని వెతకడంలో యువతరం బిజీ అయిపోయింది. మరోవైపు హీరామండిలో అంతగా పస లేని ఆర్టిస్ట్ షర్మిన్ నుంచి సంజీదా ఇబ్బందులు ఎదుర్కొందని ప్రచారమైంది. అంతగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేని షర్మిన్.. సంజీదాను విమర్శించడం చర్చనీయాంశమైంది.
కారణం ఏదైనా ఈ డిస్కషన్ తో సంజీదా పేరు కూడా మార్మోగింది. ఇప్పుడు సె* సంజీదా షేక్ చెకర్డ్ స్విమ్‌సూట్‌లో దుమారం రేపిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. సంజీదా షేక్ భారతీయ టెలివిజన్ పరిశ్రమలో చాలా కాలంగా పాపులర్ నేమ్. కానీ పెద్ద తెరపైనా అంతగా వెలగలేదు. ఇటీవలే హీరామండి: ది డైమండ్ బజార్లో వహీదా పాత్రలో నటిగా మైలేజ్ పెంచుకుంది. ఈ సిరీస్ తర్వాత సోషల్ మీడియాల్లో సంజీదా చెలరేగుతోంది. నటిగా తనను తాను రీవ్యాంప్ చేసుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.
తాజాగా సంజీదా ఇన్‌స్టాలో రెండు ఫోటోలను షేర్ చేసింది. మొదటి ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో నిలబడి పింక్ అండ్ గ్రీన్ స్విమ్సూట్ను ధరించి కాఫీ సిప్ చేస్తూ కనిపించింది. రెండవ ఫోటోలో సంజీదా నవ్వుతూ కనిపించింది. ఎలాంటి క్యాప్షన్లు లేకుండా వీటిని పోస్ట్ చేయగా.. తన స్విమ్ సూట్ గురించి ఇంటర్నెట్ లో బోలెడంత చర్చ మొదలైంది.
హీరమండిలో సంజీదా పాత్ర చాలా క్లిష్టమైనది. సంజీదా తన కుటుంబం, విధి వెంటాడటం ద్వారా మోసపోయింది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడం ప్రారంభించినప్పటి నుండి సంజీదా నటనకు ప్రశంసలు కురిసాయి. ఇటీవలి పోడ్కాస్ట్లో వహీదా పాత్ర కోసం తనను ఆడిషన్ చేయలేదని సంజీదా వెల్లడించింది. ఫిల్మీజ్ఞాన్తో చిట్ చాట్ లో సంజీదా మాట్లాడుతూ... సంజయ్ లీలా భన్సాలీ హీరామండి అనే షో చేస్తున్నాడని తనకు తెలిసిందని, అతనితో సమావేశమయ్యానని సంజీదా షేక్ చెప్పారు. ఇది 10 నిమిషాల సమావేశం.. మీరు బాగా ఉన్నారు..సంతోషంగా కనిపిస్తున్నారు.. అని మాత్రమే అన్నారు. ఆపై ఈ సమావేశం గురించి ఎవరికీ చెప్పవద్దని నన్ను కోరారు. ఆ పాత్ర నాకు దక్కుతుందనే ఆశతో ఇంటికి వెళ్లాను అని సంజీదా పేర్కొంది.
సార్ ఆడిషన్ చేయలేదు. మీటింగ్ జరిగిన 3- 4 నెలల తర్వాత లుక్ టెస్ట్ కోసం పిలిచారు. లుక్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు టీమ్ ప్రోస్తేటిక్స్ చేయడం ప్రారంభించిందని, ఎందుకంటే ఆ పాత్రధారికి తన ముఖంపై మచ్చ ఉందని తెలిసింది. వావ్ ఇది పెద్దదిగా ఉంది! అని అనిపించిందని సంజీదా తెలిపింది. అంతేకాదు.. ఇతరుల కంటే మరింత విభిన్నమైన దుస్తులను ప్రయత్నించింది. సంజయ్ లీలా భన్సాలీ స్వయంగా లుక్ పరీక్షలో పాల్గొన్నారు. తన క్యారెక్టర్ కోసం రకరకాల ఎలిమెంట్స్ చేయమని అడిగారు.. అని సంజీదా పేర్కొంది. నేను అతడు అడిగిన ప్రతిదీ చేస్తున్నాను... అతడు అకస్మాత్తుగా యే హై మేరీ వహీదా అన్నాడు! అని ఆడిషన్ లైవ్ లో జరిగిన తీరును విశదపరిచింది.
హీరామండి 1940ల నాటి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగుతుంది. ఇది విభజనకు ముందు భారతదేశంలోని ఒక ప్రధాన జిల్లా - సాంస్కృతిక వాస్తవికతను వేశ్యలు, నవాబుల దృష్టి కోణంలో ఆవిష్కరించిన సిరీస్ ఇది. ఈ ధారావాహికలో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. ఫర్దీన్ ఖాన్, తాహా షా, శేఖర్ సుమన్ , అధ్యాయన్ సుమన్ కూడా నటించారు. ఈ సిరీస్ మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది.