Begin typing your search above and press return to search.

సినీ డైరెక్టర్ సతీమణికి షాకిచ్చిన ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని!

టాలీవుడ్ దర్శకుడిగా.. తన తొలి సినిమాతోనే రోటీన్ కు భిన్నమైన డైరక్టర్ గా ఇమేజ్ సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:20 PM GMT
సినీ డైరెక్టర్ సతీమణికి షాకిచ్చిన ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని!
X

టాలీవుడ్ దర్శకుడిగా.. తన తొలి సినిమాతోనే రోటీన్ కు భిన్నమైన డైరక్టర్ గా ఇమేజ్ సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తొలి మూవీ ఘాజీతోనే సూపర్ హిట్ కొట్టిన ఆయన.. తన రెండో మూవీ అంతరిక్షంతో అందరి మన్ననలు అందుకున్నారు. రోటీన్ కమర్షియల్ మూవీలకు భిన్నంగా ఆయన సినిమాలు ఉండటం.. తొలి సినిమాకే జాతీయ అవార్డును సొంతం చేసుకోవటం తెలిసిందే.

తాజాగా ఆయన సతీమణి కీర్తిరెడ్డి అనుకోని రీతిలో వివాదంలో చిక్కుకున్నారు. కావాలని చేయకున్నా.. ఆమె విషయంలో ఒక షాపు యజమాని వ్యవహరించిన వైనం షాకింగ్ గా మారింది బంజారాహిల్స్ లోని రంగ్రెజ్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఎదుట తన కారును నిలిపిన కీర్తి రెడ్డి.. షాపింగ్ కు వెళ్లారు. ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి.. కార్ టైర్లను కోసేసి ఉండటంతో షాక్ తిన్నారు.

తన షాపు ఎదుట కారు పార్కు చేసినందుకే అలా చేశానంటూ సదరు ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఎలా చేశారని ప్రశ్నించిన ఆమె పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో తన కారును అక్కడే వదిలేసిన కీర్తిరెడ్డి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రంగ్రెజ్ ఫ్యాబ్రిక్ స్టోర్ యజమానికి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన కీర్తి రెడ్డి ప్రస్తుతం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.