Begin typing your search above and press return to search.

సంక్రాంతి మూవీస్.. ఓటీటీ వారి బాధ కూడా అదే..

సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   24 July 2024 1:30 AM GMT
సంక్రాంతి మూవీస్.. ఓటీటీ వారి బాధ కూడా అదే..
X

సంక్రాంతి సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మినిమమ్ బాగుందనే టాక్ వచ్చిన కూడా సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకోగలిగింది. అలాగే ‘నా సామిరంగా’ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి చాలా మంది హీరోలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయిపొయింది. అలాగే విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుందంట.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘NBK109’ మూవీ కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే కింగ్ నాగార్జున కూడా సంక్రాంతికి కొత్త సినిమాతో రానున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర నాలుగురు సీనియర్ హీరోలు పోటీ పడబోతున్నారు. నెక్స్ట్ ఫ్లిక్స్ ఇప్పటికే NBK109మూవీ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. అలాగే సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే మూవీస్ లో 1 లేదా 2 సినిమాల డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందంట.

నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సినిమాల థీయాట్రికల్ రిలీజ్ మధ్య గ్యాప్ ఉండాలని కోరుకుంటున్నాయి. అలా అయితే ఓటీటీలో కూడా సినిమాల మధ్య గ్యాప్ ని మెయింటేన్ చేయడానికి కుదురుతుందని భావిస్తున్నారు. కానీ సంక్రాంతి రేసులో రిలీజ్ కాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ ని ఆ స్టార్ హీరోలు మేగ్జిమమ్ చేంజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఫెస్టివల్ సినిమాలు రిలీజ్ చేస్తే కలిసొచ్చే అంశాలు చాలా ఉంటాయి. అందుకే సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ ఉండదు.

మరి ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. స్టార్ హీరోల చిత్రాలు అంటే నెట్ ఫ్లిక్స్ ముందుండి భారీ ధరలు రైట్స్ కోసం ఆఫర్ చేసి తీసుకుంటాయి. సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న మూవీస్ లో ఏది నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి. అలాగే ఈ సినిమాల థీయాట్రికల్ రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది.