Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోటీలో ముందున్న సీనియర్ హీరో!

డిసెంబర్‌ నెల మరో వారంలో ముగియబోతుంది. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా సినిమా ప్రియులకు అతి పెద్ద వినోదాల విందు రాబోతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   24 Dec 2023 2:30 PM GMT
సంక్రాంతి పోటీలో ముందున్న సీనియర్ హీరో!
X

డిసెంబర్‌ నెల మరో వారంలో ముగియబోతుంది. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా సినిమా ప్రియులకు అతి పెద్ద వినోదాల విందు రాబోతున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్‌, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్‌ మరియు తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాలు సంక్రాంతి కానుకగా రాబోతున్న విషయం తెల్సిందే.

ఒకే రోజు రెండు పాటలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోజుకు ఓ సినిమా చొప్పున సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతల మండలి పెద్దలు సూచించిన కూడా ఆయా చిత్రాల నిర్మాతలు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా తాము ప్రకటించిన తేదీలకు స్టిక్ అయ్యి ఉన్నారట.

విడుదల తేదీలు దగ్గర పడుతున్నా కూడా గుంటూరు కారం మరియు నా సామి రంగ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇతర మూడు సినిమాలు మాత్రం ప్రమోషన్ ను మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాయి. అయితే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాకు ఎక్కువ ప్రమోషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

సంక్రాంతికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యం లో వెంకటేష్ నటించిన సైంధవ్ టీమ్‌ ఫుల్‌ స్వింగ్ లో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం జరిగింది. సైంధవ్‌ దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు ఏకంగా వెంకటేష్ కూడా రంగంలోకి దిగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ఇతర సంక్రాంతి సినిమాలతో పోల్చితే సైంధవ్‌ సినిమా ప్రమోషన్ విషయంలో ముందు ఉంది అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్న మాట. కనుక సంక్రాంతి రేసులో ఇదే జోష్ తో దూసుకు పోతే తప్పకుండా సైంధవ్‌ కి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి.

సినిమాల ప్రమోషన్ ఈ మధ్య కాలంలో అత్యంత కీలకంగా మారింది. సినిమా కు హిట్ టాక్ వచ్చినా కూడా అది పబ్లిసిటీ బాగా చేస్తేనే మంచి వసూళ్లు నమోదు చేస్తుందని ఇప్పటికే పలు సినిమాల విషయంలో నిరూపితం అయింది. అందుకే సైంధవ్ కి భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు.