Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్.. 5 రోజులైనా జోష్ తగ్గట్లే..

ఇక సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 6:48 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్.. 5 రోజులైనా జోష్ తగ్గట్లే..
X

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. కుటుంబ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా రూపొందించబడినట్లు ఫస్ట్ లుక్ నుంచే అర్థమైంది. కథ, కామెడీ, ఎమోషనల్ డ్రామాలతో ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.


ప్రతి పల్లె పట్నంలో కూడా మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు పండుగల సమయంలో ప్రేక్షకులను మెప్పించగలవనే విషయాన్ని మరోసారి నిరూపించింది. ట్9రోజురోజుకు కలెక్షన్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. వెంకటేష్ కెరీర్ లో ఇప్పటికే సోలో హీరోగా జెట్ స్పీడ్ లో 100 కోట్లు అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక సంక్రాంతి అనంతరం కూడా మంచి వసూళ్ళు వేస్తుందడం విశేషం. వీకెండ్ లో కూడా కలెక్షన్లు గట్టిగానే వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ. 161 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది సాధారణ కుటుంబ కథా చిత్రానికి సాధ్యమైన విశేషం కాదు. ప్రత్యేకంగా మూడో, నాలుగో రోజులతో పోలిస్తే ఐదవ రోజు కలెక్షన్లు మరింత పెరగడం ఈ చిత్ర విజయానికి అసలు నిదర్శనం అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించడం చిత్ర నిర్మాణ సంస్థలకు ఆనందకర విషయంగా మారింది. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ, కలెక్షన్ల సునామీ 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటడానికి మార్గం సుగమం చేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. గోదారి గట్టు పాట అయితే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ,

ఇక అనిల్ రావిపూడి మ్యాజికల్ కామెడీ సీన్స్, వెంకటేష్ పర్ఫార్మెన్స్, మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేశ్ లాంటి నటీనటుల అద్భుత నటన ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.

పండుగ సమయం ఈ సినిమా విజయానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇంకా ఈ వీకెండ్‌లో వసూళ్లను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ వెంకీ సినిమా ఈ స్థాయిలో క్రేజ్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. జెట్ స్పీడ్ లోనే అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేయడం విశేషం. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ కౌంట్ ను ఇంకా పెంచుతున్నారు. చూస్తుంటే వీకెండ్ తరువాత కూడా సినిమా మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.