సంక్రాంతి ఫైట్.. దిల్ రాజు ధైర్యమేంటి?
సంక్రాంతి అనగానే ఒక నాలుగు సినిమాలు పోటీలో ఉండడం చాలా కామన్. కానీ 2024వ సంక్రాంతి సీజన్ మాత్రం టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనే సీన్ కనిపించబోతోంది.
By: Tupaki Desk | 20 Nov 2023 6:47 AM GMTసంక్రాంతి అనగానే ఒక నాలుగు సినిమాలు పోటీలో ఉండడం చాలా కామన్. కానీ 2024వ సంక్రాంతి సీజన్ మాత్రం టాలీవుడ్ లో నెవ్వర్ బిఫోర్ అనే సీన్ కనిపించబోతోంది. ఎందుకంటే ఒకేసారి ఆరు సినిమాలు పోటీలో దిగుతున్నాయి. అలాగే రెండు తమిళ సినిమాలు కూడా ఈ పోటీలో వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కాబట్టి ఈసారి పొంగల్ ఫైట్ అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది.
ఎవరికి వారు కంటెంట్ మీద నమ్మకంతో ఈ పోటీల్లో దిగుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఒక విధంగా దిల్ రాజు ఇంత పోటీ ఉన్నప్పటికీ ఎందుకు ఫ్యామిలీ స్టార్ ను సంక్రాంతికి తీసుకొస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ఎనౌన్స్ చేసిన సినిమాల లిస్టులో కాస్త లేటుగా అనౌన్స్ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్.
దిల్ రాజుకు థియేటర్లో విషయంలో పెద్దగా డోకా ఉండదు. కాకపోతే ఆయన మిగతా సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా పెట్టుబడును పెడుతున్నారు. ఇక ఫ్యామిలీ స్టోర్ మీద ఉన్న నమ్మకం చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఎన్ని సమస్యలు వస్తున్న పనులను మాత్రం అసలు ఆపడం లేదు. నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కారణంగా పుష్ప 2 లాంటి సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారు. కానీ దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. దీన్ని బట్టి సంక్రాంతిని ఎంతగా టార్గెట్ చేస్తున్నారో చెప్పనక్కరలేదు.
అయితే ప్రధానంగా దిల్ రాజు ధైర్యం మాత్రం ఈ సినిమాకు సరైన కాంబినేషన్ సెట్ కావడం. ఇదివరకే గీతగోవిందం సినిమాతో మంచి సక్సెస్ చూసిన విజయ్ దేవరకొండ పరుశురామ్ వారి స్థాయిని పెంచుకున్నారు. ఇక ఇప్పుడు సంక్రాంతి అనగానే ఫ్యామిలీ కథలకు హై డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ స్టార్ మినిమం అప్పర్ హ్యాండ్ సాధించే అవకాశం ఉంటుంది.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. దర్శకుడు పరిశురామ్ ఫ్యామిలీ కథలను బాగా హ్యాండిల్ చేయగలరు. అంతే కాకుండా అతని కామెడీ టైమింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద మిగతా సినిమాలకు పోటీ ఇవ్వడం పక్కా అని చెప్పవచ్చు.
అయితే సంక్రాంతి పోటీలో చాలా బలంగా నమ్మకం వస్తున్న వారిలో గుంటూరు కారం కూడా ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అందులోనూ కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమా రాబోతుంది. ఇక నాగర్జున కూడా సంక్రాంతి సెంటిమెంట్ లో నా సామిరంగా సినిమాను అంతే నమ్మకంతో రంగంలోకి దింపుతున్నాడు. ఇక సైంధవ్ హనుమాన్ కూడా కంటెంట్ తో మెప్పించగలిగితే అవకాశం ఉంటుంది. కానీ ఈ సినిమాల వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ మొదట్లోనే ఇంట్రెస్ట్ చూపించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి దిల్ రాజు పక్క ప్రణాళికతోనే ఫ్యామిలీ స్టార్ టైటిల్ తోనే ఆడియోన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. మరి దిల్ రాజు నమ్మిన కంటెంట్ ఏమతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.