సంక్రాంతి సినిమాలు.. జనాల ఫోకస్ ఎటువైపు?
సంక్రాంతి బరిలో తెలుగు నుంచి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం.
By: Tupaki Desk | 11 Jan 2024 4:34 AM GMTసంక్రాంతి బరిలో తెలుగు నుంచి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. ఈ నాలుగింటిలో ఒక్క గుంటూరు కారం మూవీ మాత్రమే పెద్ద సినిమా కావడం విశేషం. బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా కూడా గుంటూరు కారం టాప్ లో ఉంది. ఈ సినిమా ఏకంగా 134 కోట్ల షేర్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ సినిమాలలో జోనర్ పరంగా చూసుకుంటే అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలుగానే ఉన్నాయి. ఒక్క నా సామి రంగా మాత్రమే యూత్ అండ్ మాస్ టచ్ తో వస్తోంది. గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ కనెక్ట్ అయ్యి ఉండే యూత్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. జనవరి 12న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
ఇక హనుమాన్ ఫిక్షనల్ కథాంశంతో ఫాంటసీ మిక్స్ చేసిన మూవీగా తెరకెక్కింది. కిడ్స్ అండ్ మాస్ ఆడియన్స్ కి ఈ మూవీ భాగా కనెక్ట్ అవుతుంది. అలాగే హనుమాన్ ని బిలీవ్ చేసే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ రీచ్ అవ్వొచ్చు. ఏ స్థాయిలో ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక విక్టరీ వెంకటేష్ సైంధవ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీ టచ్ ఉన్న కథగా ఉండబోతోంది.
ముఖ్యంగా తండ్రి కూతుళ్ళ ఎమోషన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అయితే సైంధవ్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కూడా అంతకుమించి వైలెన్స్ ఎక్కువగా ఉంది. మరి శైలేష్ కొలను ఏ విధంగా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే మ్యాజిక్ మూవీలో చేసాడనేది తెలియాల్సి ఉంది.
ఇలా సంక్రాంతి సినిమాలు అన్ని కూడా దేనికదే ప్రత్యేకంగా ఉన్న కామన్ పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే మూడు సినిమాలు రాబోతున్నాయి. ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ కోరుకునేవారికి నాలుగు సినిమాలలో అవి పుష్కలంగా దొరకబోతున్నాయి.