సంక్రాంతికి వస్తున్నాంలో ఛాన్స్ అలా మిస్ అయిందట!
థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది.
By: Tupaki Desk | 18 March 2025 9:45 AM ISTవిక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొన్న సంక్రాంతికి రిలీజై ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది.
రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ప్రస్తుతమున్న డిజిటల్ యుగంలో ఏ సినిమా రెండు వారాలకు మించి థియేటర్లలో ఆడటం లేదు. అలాంటిది చాలా కాలం తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అది కూడా ఒకటి రెండు సెంటర్లలో కాదు ఏకంగా 92 సెంటర్లలో.
ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ అవుతుంది. ఈ మూవీలో కమెడియన్ కం హీరో సప్తగిరి నటించాల్సిందట. ఈ విషయాన్ని స్వయంగా సప్తగిరే వెల్లడించాడు. ఆయన నటించిన పెళ్లి కాని ప్రసాద్ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఈ విషయాన్ని చెప్పాడు.
అనిల్ రావిపూడి, సప్తగిరి మంచి ఫ్రెండ్స్. కెరీర్ స్టార్టింగ్ నుంచి అనిల్ తనకు తెలుసని, అప్పుడెలా ఉన్నాడో ఇప్పటికీ తనతో అలానే ఉన్నాడని, ఇద్దరం కలిస్తే ఎన్నో సరదా కబుర్లు చెప్పుకుంటామని అన్నాడు. కానీ ఇప్పటివరకు తమ కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదని, వాస్తవానికి తాను సంక్రాంతికి వస్తున్నాంలో నటించాల్సి ఉందని సప్తగిరి తెలిపాడు.
అందులో భాగంగానే మున్నార్ కూడా వెళ్లానని చెప్పిన సప్తగిరి ఆ సినిమాలో అంబులెన్స్ డ్రైవర్ పాత్ర సప్తగిరికి ఇద్దామని ప్లాన్ చేశాడట. కానీ ఆ క్యారెక్టర్ అనిల్ కు పూర్తిగా కిక్ ఇవ్వట్లేదు. అయినప్పటికీ ఎలాగైనా తనను సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇరికించాలని చూశాడని, ఇదంతా చూసి తన పాత్ర వల్ల సినిమాను పాడు చేయడం నచ్చక వద్దులే తర్వాతి సినిమాలో చూద్దాంలే అని చెప్పానని సప్తగిరి చెప్పాడు. అయితే తనను ఆ సినిమాలో నటింపచేయాలని అనిల్ పడిన తాపత్రయం తనకు చాలా బాగా నచ్చిందని, తన ఫ్రెండ్ అంత భారీ హిట్ అందుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందని సప్తగిరి ఈ సందర్భంగా చెప్పాడు.