సంక్రాంతి బాక్సాఫీస్.. కృష్ణ జిల్లాలో ఇది పరిస్థితి!
కానీ, కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల కలెక్షన్లు కాస్త డిఫరెంట్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. "గేమ్ ఛేంజర్" "సంక్రాంతికి వస్తున్నాం" "డాకు మహారాజ్" సినిమాలు అక్కడ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో చూద్దాం.
By: Tupaki Desk | 17 Jan 2025 10:00 AM GMTసంక్రాంతి పండగ సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి ఎనర్జిని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఏడాది కూడా మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకర్షించాయి. కానీ, కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల కలెక్షన్లు కాస్త డిఫరెంట్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. "గేమ్ ఛేంజర్" "సంక్రాంతికి వస్తున్నాం" "డాకు మహారాజ్" సినిమాలు అక్కడ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో చూద్దాం.
గేమ్ ఛేంజర్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్‌తో వచ్చి ప్రథమంగా అన్ని చోట్ల అంచనాలు పెంచింది. అయితే, కృష్ణా జిల్లాలో మాత్రం మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఇప్పుడు కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఏడవ రోజు కేవలం 15 లక్షల షేర్ రాబట్టడం విశేషం. మొత్తం కలిపి, కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 4.24 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. కృష్ణ జిల్లాలో మెగా ఫ్యామిలీ సినిమాలకు మంచి నెంబర్లు వస్తుంటాయి. ఇక టాక్ బాగుండి ఉంటే గేమ్ ఛేంజర్ ఇక్కడ సాలీడ్ రికార్డ్ లను క్రియేట్ చేసేది. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా సినిమాకు అత్యధిక స్థాయిలో థియేటర్లు దక్కాయి.
సంక్రాంతికి వస్తున్నాం
ఇక వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం కృష్ణ జిల్లాలో స్లో స్టార్ట్‌తో మొదలై, మెల్లగా గ్రాఫ్‌ను పెంచుకుంది. మూడవ రోజు 1.02 కోట్ల షేర్ రాబట్టడం గమనార్హం. ఇంతవరకు ఈ చిత్రం కృష్ణా జిల్లాలో 3.20 కోట్ల షేర్‌తో స్థిరంగా ఉంది. ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్ ఈ సినిమాకు బలంగా మారాయి, అలాగే వెంకటేశ్ మాస్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. మిగతా సినిమాలతో పోలిస్తే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ మంచి ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
డాకు మహారాజ్
అదే సమయంలో, డాకు మహారాజ్ సినిమా దూకుడు కొనసాగిస్తూ కృష్ణా జిల్లాలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక కీలకమైన స్థానాన్ని దక్కించుకోనుంది. ఐదవ రోజు 36 లక్షల షేర్ సాధించగా, మొత్తం కలిపి 3.97 కోట్ల షేర్‌తో బాగానే నిలిచింది. బాలయ్య స్టామినా ఇంకా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఈ మూడు సినిమాల్లో, గేమ్ ఛేంజర్ మొదటి రోజుల్లో ప్రాముఖ్యత పొందినా, తర్వాత రోజుల్లో ప్రేక్షకుల అభిరుచిని అందుకోవడంలో కష్టపడింది. మరోవైపు, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ చిత్రాలు తమ కలెక్షన్లలో నిలకడ చూపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల మద్దతును పొందడంలో విజయం సాధించాయి. సంక్రాంతి సినిమాల రేసులో, కృష్ణా జిల్లాలో ప్రేక్షకుల స్పందన ఒక ప్రత్యేకమైన ఎట్రాక్షన్ ను క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ మూడు సినిమాల మునుపటి రోజుల్లో సాధించిన ఫలితాల ఆధారంగా, టోటల్ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.