రిలీజ్ కి ముందే ఆ ముగ్గురి మధ్య ప్రమోషన్ వార్!
ప్రస్తుతం ఇండియా అంతటా బాక్సాఫీస్ వద్ద `పుష్ప-2` జాతర కొనసాగుతోంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ జాతరను ఆపాడం సాధ్యం కాని పని.
By: Tupaki Desk | 7 Dec 2024 5:48 AM GMTప్రస్తుతం ఇండియా అంతటా బాక్సాఫీస్ వద్ద `పుష్ప-2` జాతర కొనసాగుతోంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ జాతరను ఆపాడం సాధ్యం కాని పని. ఏడాది ముగింపును `పుష్ప-2` గ్రాండ్ గా ముగించబోతుంది. ఇంకా ఆ జాతర సంక్రాంతి రిలీజ్ ల వరకూ కొనసాగడం ఖాయంగానే కనిపిస్తుంది. అటుపై లెక్క మారుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమా రిలీజ్ లు డేట్లను లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు.
ఒక్కో సినిమా రెండు రోజుల గ్యాప్‌తో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు భారీ హైప్ క్రియేట్ చేసాయి. విడుదలైన మూడు పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ వస్తే? ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇక జనవరి 12న `గాడ్ ఆఫ్ మాసెస్` నందమూరి బాలకృష్ణ కథా నాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న`డాకు మహారాజ్` రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వారం నుంచి ప్రచారం పనుల మొదలు పెట్టాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అటు రెండు రోజుల గ్యాప్ అనంతరం జనవరి 14న విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. ఇప్పటికే తొలి లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై హైప్ పెంచేలా ప్రచారం నిర్వహిం చాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూడు సినిమాలకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఏ హీరో కూడా ఒకరికొకరు పోటీగా రావడం లేదు. ముగ్గురు హీరోలు రెండు రోజుల గ్యాప్ లో వస్తున్నారు. దీంతో థియేటర్ల సర్దుబాటు సహా ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అంతిమంగా సంక్రాంతి వార్ లో ఎవరి పై చేయి అవుతుం దన్నది? లాంగ్ రన్ లో తేలుతుంది. అయితే ప్రచారం పరంగా మూడు చిత్రాల మధ్య మాత్రం పోటీ తప్పదు. మూడు భారీ సినిమాలు కావడంతో ప్రచారం పరంగా ఎవరి స్ట్రాటజీతో వారు ముందుకెళ్తారు. అది అభిమానుల మధ్య పోటీకి దారి తీస్తుంది.