Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమా పోస్టర్ల సందడి..!

ఐతే సంక్రాంతికి సినిమాలే కాదు పండగ రోజు కొత్త సినిమాల పోస్టర్స్ తో కూడా పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 8:49 AM GMT
సంక్రాంతి సినిమా పోస్టర్ల సందడి..!
X

సంక్రాంతికి థియేటర్ లో సినిమాల సందడి తెలిసిందే. ఈ పొంగల్ కి 3 సినిమాలతో ఫెస్టివల్ వైబ్ ని మరింత పెంచారు. ఐతే సంక్రాంతికి సినిమాలే కాదు పండగ రోజు కొత్త సినిమాల పోస్టర్స్ తో కూడా పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేస్తున్నారు. సంక్రాంతికి సినిమాల పండగలానే పోస్టర్స్ పండగ చేస్తున్నారు.


ఈ క్రమంలో శర్వానంద్ నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ వదిలారు. శర్వానంద్ హీరోగా రాం అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు నారి నారి నడుమ మురారి టైటిల్ ఫిక్స్ చేశారు.


ఆ సినిమా తర్వాత మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి హ్యాపె సంక్రాంతి పోస్టర్ రిలీజైంది. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ ప్రభాస్ రాజా సాబ్ కొత్త పోస్టర్ వదిలారు. రాజా సాబ్ ప్రభాస్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. దీనితో పాటు సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రాం చరణ్ గేం ఛేంజర్ నుంచి కొత్త పోస్టర్ వదిలారు. రాం చరణ్ అంజలి ఉన్న ఈ పోస్టర్ అదిరిపోయింది.


ఇక సంక్రాంతికి విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా సినిమా నుంచి పోస్టర్ వచ్చింది. లేడీ గెటప్ లో విశ్వక్ లుక్స్ అదిరిపోయింది.


కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్ రూబా సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. క తో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో మరో హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అవబోతుంది అంటూ రిలీజ్ డేట్ తో దిల్ రూబా పోస్టర్ వదిలారు.


విజయ్ కనకమేడల డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఇలా ముగ్గురు హీరోలు కలిసి చేస్తున్న భైరవం సినిమా నుంచి పండగ రోజు పోస్టర్ వదిలారు. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షల పోస్టర్ వచ్చింది. ఇలా పండుగ కోసం ప్రేక్షకులను మెప్పించే పోస్టర్స్ తో సంక్రాంతి జోష్ మరింత పెంచేలా చేశారు. కలర్ ఫుల్ పోస్టర్స్ తో కలర్ ఫుల్ హంగామాగా ఉంది. ఐతే ఈ సినిమాల విషయంలో ఆ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఖుషిగా ఉన్నారు.